ఇది అలాంటి ఇలాంటి బస్సు కాదు .. ఏమిటో తెలిస్తే షాకవ్వాల్సిందే

Proterra Catalyst E2 Electric Bus Series

11:06 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Proterra Catalyst E2 Electric Bus Series

ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో రోజుకో ఆవిష్కరణ వెలుగులోకి వస్తోంది. ఆట బొమ్మల నుంచి పెద్ద పెద్ద వాహనాల వరకు సరికొత్త సాంకేతికతను ఉపయోగించి తయారుచేస్తున్నారు. ఇక వాహనాల విషయంలోకి వస్తే ఇప్పటి వరకు పెట్రోలు, డీజిల్ ఉపయోగించి నడిచే వాహనాలను రూపొందించగా కొంతకాలంగా విద్యుత్ తో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విషయంలో మాత్రం ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం తక్కువే. అయితే చార్జింగ్ విషయంలో అపోహలు, ఎక్కువ దూరం ఇవి ప్రయాణించలేకపోవడంతో ఈ విషయంలో వినియోగదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది.

అయితే ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం అమెరికా కంపెనీ ప్రోటెర్రా ‘ప్రోటెర్రా క్యాటలిస్ట్ ’ అనే ఎలక్ట్రిక్ బస్సును తయారుచేసేసింది. 660 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో పనిచేసే ఈబస్సు, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 563 కిమీల వరకు ప్రయాణిస్తుంది. టెస్ట్ డ్రైవ్ లో మాత్రం 966 కిలోమీటర్లు ప్రయాణించి ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ బస్సులో ఉండే లోడ్ ను బట్టి ఇది 312 నుంచి 563 కిమీలు ప్రయాణించగలదని కంపెనీ సీఈవో రయాన్ పోపుల్ తెలిపారు. త్వరలో ఈ బస్సును ప్రపంచవ్యాప్తంగా విపణిలోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: జయప్రదను చూసి లొట్టలేసుకున్న కలెక్షన్ కింగ్

ఇది కూడా చూడండి: బుద్ధుని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చూడండి: మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

English summary

Proterra Catalyst E2 Electric Bus Series