కోరికలను నెరవేర్చలేదని మంత్రిని కొట్టి చంపిన కూలీలు!

Protesting miners killed Bolivia minister

11:11 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Protesting miners killed Bolivia minister

ఒక్కోసారి ఆందోళన అదుపుతప్పితే ప్రాణాలే పోతాయి. కోపోద్రేకంలో ఎవరు ఏమి చేస్తున్నారో తెలీదు. సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. వివరాల్లోకి వెళ్తే.. అధిక రాయితీలు కల్పించాలని, ప్రైవేటు కంపెనీలో పనిచేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ బొలివియాలోని గనికార్మికులు గత మంగళవారం నుంచి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. హైవేలపై ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురైన కార్మికులు పండురో ప్రాంతంలో డిప్యూటీ హోంమంత్రి రొడాల్ఫో ఇలేన్స్, అతడి వ్యక్తిగత సిబ్బందిని కిడ్నాప్ చేశారు. రొడాల్ఫోను కార్మికులు అతిదారుణంగా కొట్టి చంపేశారు.

ఈ విషయాన్ని బొలివియా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఇక ఈ ఘటనతో స్థానికంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు, గనికార్మికులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనలో 100మందికి పైగా కార్మికులను అరెస్టు చేయగా, మరికొందరిని ఇంకా గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాగ్ 'హాథీరామ్ బాబా' ఫస్ట్ లుక్

ఇది కూడా చదవండి: లంచం ఇచ్చేందుకు బిచ్చగాడుగా మారిన కుర్రాడు

ఇది కూడా చదవండి: నాగ్ చిత్రాలతో పోస్టల్ స్టాంప్ ...

English summary

Protesting miners killed Bolivia minister. Protesting miners killed Bolivia minister for not fulfilling their desires.