బరువు తగ్గే చిట్కాలు

Proven ways to lose Weight

03:28 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Proven ways to lose Weight

బరువు తగ్గటం అంటే చాలా మంది విపరీతంగా వ్యాయామాలు చేయటం మరియు డైట్ కంట్రోల్ పెడితే సరిపోతుందని భావిస్తారు. కానీ ఈ పద్దతిలో కాకుండా మీ జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకొని సహజంగా బరువు తగ్గటానికి కొన్ని ప్రభావంతమైన చిట్కాలు ఉన్నాయి. వీటిని సరిగ్గా పాటిస్తే సులువుగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. అంతేకాక బరువు తగ్గితే అందం,ఆరోగ్యం మన సొంతం అవుతాయి.

1/5 Pages

1. తగినంత నీటిని త్రాగాలి

కేవలం నీటిని త్రాగి బరువు కోల్పోవచ్చు. చాలా కఠినమైన ఆహార ప్రణాళిక అనుసరించినా సరే తగినంత నీటిని త్రాగకపోతే తక్కువ బరువు మాత్రమే కోల్పోవటం జరుగుతుంది. అలాగే ఆ బరువు తగ్గటానికి కూడా చాలా సమయం పడుతుంది. నీరు అనేది జీవక్రియ వేగంగా జరిగి కేలరీలను ఖర్చు చేసే ప్రక్రియను ప్రేరేపిస్తుంది.

2003 లో క్లినికల్ ఎండోక్రినాలజీ మరియు జీవప్రక్రియ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనంలో రెండు కప్పుల గోరువెచ్చని నీటిని త్రాగితే జీవక్రియ రేటు 30 శాతం పెరుగుతుందని తెలిపింది.

అలాగే భోజనం చేయటానికి ముందు నీటిని త్రాగితే ఆకలిని నిరోదిస్తుంది. దాని పలితంగా తీసుకొనే ఆహార పరిమాణం కూడా తగ్గుతుంది.

ఎనిమిది వారాల పాటు ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్,లంచ్,డిన్నర్ చేయటానికి ఒక అర గంట ముందు రెండు కప్పుల నీటిని త్రాగితే శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) తగ్గుతుంది.  50 మంది అధిక బరువు కలిగిన అమ్మాయిలలో ఈ పరిశోదన చేసి 2013 క్లినికల్ అండ్ డయాగ్నొస్టిక్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించింది.

English summary

There are lot of ways for weight loss. Here we are listing few of proven ways to lose weight.