పీఎస్‌ఎల్‌వీ సీ-31 సక్సెస్

PSLV C31 Launched Sucessfully

10:22 AM ON 20th January, 2016 By Mirchi Vilas

PSLV C31 Launched Sucessfully

మరో అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది.భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం ఉదయం 9.31గంటలకు పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ31(పీఎస్‌ఎల్‌వీ) వాహక నౌకను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ సోమవారం నాదే ప్రారంభమైంది. 48గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో పీఎస్‌ఎల్‌వీ సీ-31 ప్రయోగం వి జయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ రాకెట్‌ ద్వారా నావిగేషన్‌ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌-1ఇ ఉప గ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. తాజా ఉపగ్రహంతో గ్లోబల్‌ పొజిషినింగ్‌ సిస్టమ్‌(జీపీఎస్‌)కు మరింత వూతం ఇవ్వనుంది. భూ స్థిర కక్ష్యకు 36వేల కిలోమీటర్ల ఎత్తున ఉపగ్రహాన్ని రోదసీలో నిలిపారు. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేసారు.

English summary

ISRO launched PSLV C-31 satellite successfully from Sathish Dhawan Space Centre wehich was in Nellore, Andhra Pradesh. This satellite was launched at 9:31a.m today