పీఎస్‌ఎల్వీ-సీ32 ప్రయోగం విజయవంతం 

PSLV-C32 rocket launch successful in Sriharikota

05:45 PM ON 10th March, 2016 By Mirchi Vilas

PSLV-C32 rocket launch successful in Sriharikota

దిశా నిర్దేశ వ్యవస్థకు సంబంధించిన ఆరో ఉపగ్రహాన్ని గురువారం సాయంత్రం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం(షార్‌) నుంచి సాయంత్రం 4 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ 32 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. దేశంలోని ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థలో ఇది మరో మైలురాయిగా నిలవనుంది. 44.4 మీటర్ల పొడవు, 1,425 కేజీల బరువున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఎఫ్‌ అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్లి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గతంలోని ఇస్రో నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగాలను పరిశీలిస్తే, 2013, జూలై 1- ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఏ ఉపగ్రహం ప్రయోగించగా; 2014, ఏప్రిల్‌ 4 -ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1బీ: 2016, అక్టోబర్‌ 16 -ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1సీ; 2015, మార్చి 28 -ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1డీ; 2016, జనవరి 20 -ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1ఈ ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు పీఎస్‌ఎల్వీ-సీ 32 ప్రయోగించింది.

నావిగేషన్‌ వ్యవస్థపై పనిచేసేందుకు వీలుగా ఇస్రో 2013లో తొలిసారిగా ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అదే ఇండిపెండెంట్‌ రీజనల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌). ఈ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటివరకు ఆరు ఉపగ్రహాలను ప్రయోగించింది. మార్చి నెలాఖరు నాటికి నావిగేషన్‌ వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఖచ్చితమైన గమనాన్ని నిర్దేశించేందుకు వీలుగా భారత్‌ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ శాటిలైట్లను ప్రయోగిస్తోంది. ఈ ఉపగ్రహాల జీవితకాలం 12 ఏళ్లు. 1500 కిలోమీటర్ల మేర కచ్చితమైన దిశను నిర్దేశించేలా ఈ ఏడు ఉపగ్రహాలు పనిచేస్తాయి.

దీంతో దేశీయ ఉపగ్రహ దిక్సూచి వ్యవస్థలో ఈ శాటిలైట్లు కీలకం కానున్నాయి. మొబైల్‌ ఫోన్లను అనుసంధానం చేయడంలో సాయపడతాయి. డ్రైవర్లకు విజువల్‌, వాయిస్‌ నావిగేషన్‌ అందించడానికి దోగాదపడతాయి. విపత్తు సమయంలో బాధితులకు సహకారాన్ని అందిస్తాయి. భూతల, ఆకాశ, సాగరాల్లో దిశానిర్దేశ సేవలందించేందేలా వీటిని రూపొందించారు. విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడంలోనూ ఈ ఉపగ్రహాలు సాయం చేస్తాయి. ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు పీఎస్‌ఎల్వీ-సీ32 వాహక నౌక ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.

భూతల, ఆకాశ, సాగరాల్లో దిశా నిర్దేశానికి సబంధించిన సేవలందించనున్న ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల వారు హర్షం వ్యక్తంచేశారు. ఇంకా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెల్పారు.

English summary

PSLV-C32 rocket launch successful in Sriharikota.