ఉన్మాది వీరంగం - చికిత్స పొందుతూ మృతి 

Psycho Attack In Karimnagar

11:38 AM ON 22nd December, 2015 By Mirchi Vilas

Psycho Attack In Karimnagar

ఈ మధ్య మానసిక ఉన్మాదుల చర్యలు పలు చోట్ల భయంగొల్పుతున్నాయి. పోలీసులకే సవాల్ విసురుతూ సైకోలు చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు. తాజాగా కరీంనగర్ కమాన్ దగ్గర ఓ సైకో సృష్టించిన వీరంగంలో 20మంది గాయపడ్డారు. చివరకు అతడు కూడా మరణించాడు.

ఈఘటన వివరాలలోకి వెళితే , ఓ సైకో మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులపైన , కాలనీ వాసులపైనా తల్వార్ తో పెట్రేగి పోయాడు. దీంతో 20మంది గాయపడ్డారు. చివరకు పోలీసులపై కూడా దాడికి తెగబడ్డతో వాళ్ళు కూడా గాయపడ్డారు. దీంతో ఉన్మాది కాళ్ళపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడు చిక్కాడు.

ఉన్మాదిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేయించడానికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Psycho Attacked with knife in karimnagar and injured almost 20 people including police. Police shooted him for their safety and he rushed to hospital then he died in hospital while taking treatment