మిస్ వరల్డ్ వెనుక రహస్యం ఇదే

Puerto Rico Beauty Crowned As Miss World 2016

11:31 AM ON 20th December, 2016 By Mirchi Vilas

Puerto Rico Beauty Crowned As Miss World 2016

అందాల పోటీలు అంటేనే అదో క్రేజ్. అందునా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీలు అంటే ఇక చెప్పక్కర్లేదు. మిస్ వరల్డ్ కావాలని కలలు కని వాటిని నిజం చేసుకోవడం నిజంగా ఓ పెద్ద ఛాలెంజ్. ఐశ్వర్యారాయ్(1994), యుక్తా ముఖి(1999)లలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోగా,భారత్ చివరిసారిగా ప్రియాంక చోప్రా(2000) మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు మిస్ వరల్డ్-2016 కిరీటాన్ని 19 ఏళ్ల పోర్టారికో సుందరి స్టిఫానీ డెట్ వాల్లె గెలుచుకుంది. ప్రపంచంలోని మేటి అందగత్తెలతో పోటీ పడి టైటిల్ని అందుకుంది. గతేడాది ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకున్న మేరియా లాలాగుణా రోయో.. స్టిఫానీకి కిరీటాన్ని అందజేసింది.

స్టిఫానీ.. లా అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్. ప్యూర్టో రికో దేశానికి మిస్ వరల్డ్ టైటిల్ దక్కడం ఇది సెకండ్ టైమ్. 1975లో విల్నేలియా మెర్సిడ్ మిస్ వరల్డ్ టైటిల్ని గెలుచుకుంది. ఫస్ట్ రన్నరప్ డొమినికన్ రిపబ్లిక్ బ్యూటీ కాగా, సెకండ్ రన్నరప్ ఇండోనేషియా సుందరి.

ఈ పోటీలకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మొత్తం 116 మంది బ్యూటీలు హాజరయ్యారు. ఈ పోటీల్లో భారత్కి చెందిన ప్రియదర్శిని టాప్-20కి చేరినా, టాప్ 5లో ప్లేస్ సంపాదించలేకపోయింది. అమెరికాలోని మేరీల్యాండ్లో నిర్వహించిన ఫైనల్ పోటీల్లో కెన్యా, ఇండోనేషియా, డొమినికన్ రిపబ్లిక్, ఫిలిప్పైన్స్ కు చెందిన సుందరీ మణులను దాటుకొని స్టిఫానీ డెట్ వాల్లె విజేతగా నిలిచింది.

ఇవి కూడా చదవండి: బేఫికర్ గా న్యూడ్ పోజ్ ఇచ్చిన బాలీవుడ్ హీరో

ఇవి కూడా చదవండి: అందానికి కాదు సత్తాకు ఉద్యోగం ఇవ్వాలన్న అమ్మాయి .. ఇంతకీ ఏమైందో తెలుసా

English summary

Puerto Rico Beauty named Stephanie Del Valle Crowned As Miss World 2016. This event was organised in Maryland in America