సింధుకు కోచ్ గా గోపీచంద్ తొలగింపు!

Pullela Gopichand was removed as a coach for PV Sindhu

11:01 AM ON 23rd August, 2016 By Mirchi Vilas

Pullela Gopichand was removed as a coach for PV Sindhu

రియో ఒలింపిక్స్ లో భారత సత్తా చాటిన స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కృషి ఎంతో దాగి వుందన్నది గుర్తించాలి. కొన్ని ప్రభుత్వాలు సింధుతో పాటు గోపీచంద్ కి కూడా నజరానాలు ప్రకటించాయి. ఇక రజత పతకంతో హైదరాబాద్ వచ్చిన పీవీ సింధుతో పాటు ఆమె కోచ్ గా గోపీచంద్ ను కూడా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. సింధునే కాకుండా ఆమె లాంటి చాలామంది క్రీడాకారులను గోపీచంద్ ఎంతో మందిని తీర్చిదిద్దారు. అయితే.. సత్తా కలిగిన ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న గోపీచంద్ కు తెలంగాణ సర్కారు నుంచి భారీ షాక్ తగిలింది.

తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోచ్ గా గోపీచంద్ మెరుగ్గా రాణిస్తున్నారని కితాబిచ్చిన అలీ, పీవీ సింధుకు మాత్రం మరింత మెరుగైన కోచ్ కోసం వెతుకుతున్నామని ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో మేధావుల మెదళ్ళకు పని పడింది. పీవీ సింధుని ప్రపంచ నెంబర్ 1ని చేయాలన్నదే ఈ నిర్ణయానికి కారణంగా భావిస్తున్నారు. అంతేకాదు ఎపి సీఎం చంద్రబాబుతో ఎక్కువ టచ్ లో గోపీచంద్ ఉండడం కూడా తెలంగాణా సర్కార్ కి ఇబ్బందిగా ఉండడం ఓ కారణం అంటున్నారు.

English summary

Pullela Gopichand was removed as a coach for PV Sindhu