ముఖ సౌందర్యానికి గుమ్మడికాయ

Pumpkin for skin and hair care

01:29 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Pumpkin for skin and hair care

గుమ్మడి కాయ అందరికీ తెలిసినదే దీన్ని చాలా మంది వంటకాలలో వాడుతారు గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ ఒడియాలు ఇలా ఎన్నో రకాలుగా వాడుతాం. కాని ఇది సౌందర్య సాధనాలలో కూడా కీలక పాత్ర వహిస్తుందని చాలా మందికి తెలియదు.ఈ రోజు గుమ్మడి కాయని సౌందర్య సాధనాలలో ఎలా ఉపయోగించాలో తెలుకుందాం. గుమ్మడి కాయ వంటకాలు ఎంత రుచిగా ఉంటాయో! అదే విధంగా గుమ్మడి కాయతో చర్మానికి కుడా అంత సౌందర్యాన్ని ఇస్తుంది. గుమ్మడి కాయని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పేస్‌ మాస్క్‌, బాడీ మాస్క్‌, ఆయిల్‌ కంట్రోల్‌, పొడిబారిన పెదాలు ఇలా ఎన్నో సమస్యలకు గుమ్మడి కాయని ఉపయోగించవచ్చు.

గుమ్మడికాయ పేస్ట్‌ తయారు చేయు విధానం:

 • ముందుగా తాజా గుమ్మడి కాయలు తీసుకొవాలి.
 • తీసుకున్న గుమ్మడి కాయలను సగానికి కత్తిరించి దానిలోని విత్తనాలను తీసేసి వాటిని ముక్కలుగా కోసి 45 నిమిషాలు పాటు ఉడికించాలి. తరువాత గుమ్మడికాయ తొక్కను తొలగించి మిక్సీలో వేసి బాగా మొత్తని పేస్ట్‌లాగా చేయాలి.

1. పేస్‌మాస్క్‌ :

 • ముందుగా తయారు చేసుకున్న గుమ్మడికాయ గుజ్జులో కొంచెం తేనె కలిపి ముఖనికి రాసుకుని 20 నిమిషాలు గడిచిన తరువాత ముఖన్ని శుభ్రంగా కడగాలి. మీరు మృదువైన సున్నితమైన ప్రకాశవంతమైన ముఖన్ని పొందుతారు.
 • మరో పద్ధతి కూడా వాడవచ్చు. గుమ్మడి కాయ గుజ్జు తేనె మరియు ఆపిల్‌ సైడర్‌ వెనీగర్‌ ఈ మూడింటిని వాడటం వల్ల కూడా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వీటిని ముఖనికి ప్యాక్‌ లాగా వేసుకుని 25 నుండి 30 నిమషాలు తరువాత ముఖన్ని మసీజ్‌ చేస్తూ శుభ్రంచేసుకోవాలి.

2. మొటిమలకు :

 • గుమ్మడి కాయతో విటమిన్‌ ఎ, సి, మరియు జింక్‌ ఉన్నాయి. ఈ విటమిన్స్‌ వల్ల చర్మానికి చాలా మంచిది. దీన్ని డాక్టర్స్‌కూడా సిఫార్స్‌ చేస్తున్నారు.
 • సహజసిద్ధమైన గుమ్మడి కాయ గుజ్జుని తీసుకుని మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసుకోని 30 నిమిషాలు గడిచిన తరువాత చన్నీటి తో శుభ్రపరుచుకోవాలి.

3. బాడీ మాస్క్‌ :

 • గుమ్మడి కాయలో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉండటం వలన ఇది మృదుత్వాన్ని సంతరించుకునేలా చేస్తుంది.
 • 2 టేబుల్‌ స్పూన్‌ గుమ్మడికాయగుజ్జు తీసుకుని దానిలో ఒక టేబుల్‌ స్పూన్‌ ఆయిల్‌ ని వేసి బాగా కలపాలి.
 • తయారయిన మిశ్రమాన్ని శరీరం అంతా రాసుకుని 10 నుండి 15 నిమిషాలు తరువాత శుభ్రంగా కడగాలి.

ఈ విధంగా చేయడం వలన చర్మం నిగారిస్తుంది.

4. మృదువైన చర్మానికి :

 • గుమ్మడి కాయ అధిక మోతాదులో జింక్‌ ఉంటుంది. ఇది కూడా యాంటి ఇన్‌ప్లమేటరీ గుణాలు కలిగి ఉండటం చేత ఇరిటేషన్‌కి గురిఅయిన చర్మాన్ని మృదువుగా మార్చి ఇరిటేషన్‌ కలుగకుండా చూసుకుంటుంది.
 • గుమ్మడి కాయ గుజ్జుని తీసుకొని దానిలో కొద్ధిగా పాలను కలిపి ఇరిటేషన్‌ కలిగే ప్రాంతంలో రాసుకుని 4 నుండి 10 నిమిషాలు గడిచిన తరువాత కడిగేయాలి.

5. ఆయిల్‌ ప్రోడక్షన్‌ నుండి విముక్తి :

 • గుమ్మడి కాయ అధికంగా ఉత్పత్తి అయ్యే నూనె గ్రంధులను ఆరికడుతుంది. దీనిని ముఖనికి మాస్క్‌గా వేసుకోవడం వలన ఆయిల్‌ స్కిన్‌ నుండి విముక్తి పొందవచ్చు.
 • గుమ్మడి కాయ గుజ్జులో కొంచెం ఆపిల్‌ సైడర్‌ వెనీగర్‌ మరియు పంచదార వేసి బాగా కలపాలి.
 • ఈ మిశ్రమంతో చర్మాన్ని బాగా రుద్ధుకొని 10నిమిషాలు తరువాత కడిగేయాలి.

6. జీవం లేని పెదాలకు విముక్తి :

 • పొడిబారిన పెదాలకు గుమ్మడికాయ మంచి ఫలితాన్ని ఇస్తుంది. గుమ్మడి కాయ పేస్ట్‌ని లిప్‌బామ్‌ లాగా ఉపయోగించవచ్చు. దీనిలో విటమిన్‌ ఇ ఉండటం వలన పెదాలకు జీవాన్ని పోసి అందంగా ఉండటం వలన పెదాలకు జీవాన్ని పోసి మెరిసేలా చేస్తుంది.
 • రాత్రి పడుకునే ముందు పెదాలను ముద్ధగా గుమ్మడికాయ పేస్ట్‌ని రాసుకోవాలి. లేదా గుమ్మడికాయ ఆయిల్‌ కూడా వాడవచ్చు ఉదయం లేచే సరికి మృదువైన మరియు ప్రకాశవంతమైన పెదాలు మీ సొంతం అవుతాయి.

7. నల్లని వలయాలు :

 • గుమ్మడి కాయ లో విటమిన్‌ ఎ ఉండటం వలన దీన్ని తినేవారికి కంటికి సంబందించిన సమస్యలు దరిచేరవు. అలాగే ఇది కంటి చుట్టూ ఏర్పడిన నల్లని వలయాలను కూడా దూరం చేస్తుంది. అదేవిధంగా కంటికింద బ్యాగ్‌లను కూడా ఇది మాయం చేసి కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుంది.
 • గుమ్మడి కాయ గుజ్జుని తీసుకొని కంటి చుట్టూ రాసుకుని 10 నిమిషాలు గడిచిన తరువాత కడిగాలి.

8. నల్లని మచ్చలు రంధ్రాలు:

 • గుమ్మడికాయలో విటమిన్‌ సి మరియు ఇ అధికమోతాదులో ఉంటాయి. అందువల్ల ఇది యాంటి ఆక్సిడంట్స్‌ మాదిరిగా పనిచేసి మచ్చలను రంద్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
 • గుమ్మడికాయ గుజ్జుని తీసుకొని అందులో ఆపిల్‌ సైడర్‌ తేనే కలిపి మచ్చలు కలిగిన ప్రాంతంలో రాసుకోవాలి.
 • గుమ్మడికాయ గుజ్జులో గంధం పోడి వేసి బాగా కలిపాలి. వచ్చిన మిశ్రమాన్ని ముఖనికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడిగేయాలి.

9. ముడతలు:

గుమ్మడికాయలో యాంటీ ఆక్సీడంట్స్‌ ఉండటం వలన ఇది ఫ్రీ రాడికల్స్‌ తో పోరాడుతుంది. అదేవిధంగా దీనిలో విటమిన్‌ ఎ ఉండటం వలన ముడలనను తగ్గించి మీ వయస్సుని తగ్గిస్తుంది.

గుమ్మడికాయ గుజ్జులో కొద్ధిగా పైనాపిల్‌ జ్యూస్‌ కలిపి ముఖనికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత శుభ్రంగా కడగాలి.

10. హెయిర్‌ మాస్క్‌

 • మీజుట్టు పొడిగా మరియు చిట్లిపోయి ఉందా అయితే ఈ చిట్కాని వాడి చూడండి మంచి ఫలితాన్ని పోందుతారు. గుమ్మడికాయలో ఎమినో యాసిడ్‌ కూడా ఉండటంతో ఇరి జుట్టుని నిగారించేలా చేసి చిట్లిపోయిన జుట్టునుండి విముక్తి కల్గిస్తుంది.
 • 2 టేబుల్‌ స్పూన్‌ గుమ్మడి గుజ్జుని తీసుకుని 2 టేబుల్‌స్పూన్‌ పెరుగు, 1 టీ స్పూన్‌ ఆవిల్‌ ఆయిల్‌, 1 టీ స్పూన్‌ తేనె, 1 టీ స్పూన్‌ ఆపిల్‌ సైడర్‌ వెనీగర్‌ కలపాలి. అన్నింటినీ చాగా కలపాలి. వచ్చిన మిశ్రమాన్ని జుట్టు కుదాళ్ళకు పట్టించి 20 నిమిషాలు గడిచిన తరువాత శుభ్రంగా కడగాలి.

11. మాయిశ్చరైజర్‌ :

 • గుమ్మడి కాయలో సహాజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ గుణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని పొడిచా నివ్వకుండా చూసుకుంటుంది.
 • గుమ్మడికాయ గుజ్జుని శరీరానికి రాసుకుని 10 నిమిషాలు గడిచిన తరువాత శుభ్రంగా కడిగేయాలి.
 • గుమ్మడి విత్తనాల ఆయిల్‌ ని కూడా ఉపమోగించవచ్చు.

వీటిని ఉపయోగించడం ద్వారా చర్మం పొడిబారదు.

12. పొడి చర్మం నుండి ఉపశమనం :

పైన తెలిపిన విధంగా ఇది పొడి చర్మాన్ని దరిచేర నివ్వదు. శరీరంపై ఉన్నమృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా తీర్చిదిద్ధుతుంది.

గుమ్మడికాయ గుజ్జుని తీసుకొని శరీరాన్ని మసాజ్‌ చేసుకోవాలి. ఇలా 20 నుండి 25 నిమిషాలు చేసి తరువాత శుభ్రంచేసుకోవడం వలన మంచి ఫలితాన్ని పోందుతారు.

13. అలర్జీ :

చర్మం ఎర్రగా మారడం లేదా ఏమైన చర్మ సంబంధమైన అలర్జీలతో బాధపడేవారు ఆ చిట్కాని వాడటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు.

చల్లని గుమ్మడికాయ గుజ్జుని అలర్జీకి సరిఅయిన ప్రాంతంలో లేదా ఎర్రగా దద్ధుర్లు దురద, మంట కలిగిన ప్రాంతాలలో రాసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. 10 నిమిషాలు గడిచిన తరువాత శుభ్రంగా కడగాలి.

14. స్క్రబ్‌ :

గుమ్మడి కాయ మృత కణాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది. చిన్నపిల్లల చర్మం ఎంత మృదువుగా ఉంటుందో అదే విధమైన చర్నాన్ని గుమ్మడికాయ వాడిన వారి సొంతం అవుతుంది. చాలా మంది స్క్రబ్‌ చేసుకోవడానికి బయట దొరికే ప్రోడక్ట్స్‌ని వాడి డబ్బులు వృధాచేసుకుంటారు. ఇది అతి సులభమైన మరియు డబ్బుతో ఖర్చులేని పని.

గుమ్మడికాయ గుజ్జు మరియు పంచదార సమపాళ్ళులో తీసుకొని బాగా కలిపాలి.

మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని ముఖన్ని బాగా స్క్రబ్‌ చేసుకోవాలి.

15. ప్రకాశవంతమైన చర్మం:

 • చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది అంతే కాకుండా ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని తిరిగి రంగు సంతరించుకునేలా చేస్తుంది. దీనిలో విటవిన్‌ ఎ, సి ఉండటం వలన చర్మాన్ని మైడ్రేట్‌ చేసి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
 • 2 టేబుల్‌ స్పూన్ల గుమ్మడికాయ గుజ్జుని తీసుకుని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు, ఒక టీస్పూన్‌ తేనె, ఒక టేబుల్‌ స్పూన్‌ బాదం పేస్ట్‌ మరియు సగం టీస్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ తీసుకొని అన్నింటినీ బాగా కలపాలి.
 • వచ్చిన మిశ్రమాన్ని ముఖనికి రాసుకుని బాగా మసాజ్‌ చేయాలి.
 • 20 నిమిషాలు గడిచిన తరువాత నీటిలో శుభ్రంచేసుకోవాలి.

16. సాగిన చర్మానికి :

 • గుమ్మడికాయ సాగిపోయిన చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.
 • 2 టేబుల్‌ స్పూన్‌ గుమ్మడికాయ గుజ్జుని తీసుకుని అందులో ఒక గుడ్డుని కలిపి చర్మానికి రాసుకుని 30 నిమిషాల తరువాత కడిగేయాలి.
 • ఆ పద్ధతి పాటించడం వలన సాగిన చర్మం మళ్ళీ బిగుతుగా మారి ప్రకాశవంతంగా కనపడుతుంది.

17. అందమైన చర్మం :

గుమ్మడికాయ చర్మాన్ని తెల్లగా చేయడం లో సహాయపడుతుంది.

 • కొంచెం గుమ్మడికాయ పేస్ట్‌ని తీసుకొని అందులో కొద్ధిగా బియ్యంపిండి మరియు పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి.
 • ఈ పేస్ట్‌ని ముఖనికి రాసుకుని 20 నిమిషాలు తరువాత ముఖన్ని కడిగేేయాలి.
 • ఈ ఫేస్‌ప్యాక్‌ వల్ల మంచి రంగుని పొందుతారు.

English summary

Pumpkin for skin and hair care. We know that pumpkin season it here. Pumpkin are literally every where people uses them for baking.