అబ్బో, ఒలింపిక్ పతకం గెలవలేదని శిక్షలు వేస్తున్నాడు

Punishment for athletes in North Korea

10:37 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Punishment for athletes in North Korea

ఒలింపిక్స్ లో పతకం సాధించినందుకు నజరానాలు ప్రకటించడం.. సన్మానాలు చేయడం, అంతలేదు, ఇంతలేదు అంటూ తెగ మోసెయ్యడం ఇవన్నీ మామూలుగా మనం చూస్తున్నాం. కానీ పతకాలు సాధించని వారికి శిక్షలు విధించడం ఎక్కడైనా చూశారా? అంటే కొంత ఆలోచిస్తారు. కానీ ఈ చిత్రం ఉత్తర కొరియాలో చోటు చేసుకోబోతోంది. ఆ దేశాన్ని పాలించే నియంత కిమ్ జాంగ్ అరాచకాలకు తాజా ఉదాహరణగా ఇలాంటి తతంగం చోటుచేసుకుందట. గతంలో ఫుట్ బాల్ ప్రపంచకప్ లో విఫలమైనందుకు తమ దేశ క్రీడాకారుల్ని నిలబెట్టి తీవ్ర దూషణలకు దిగడంతో పాటు వారిని అనేక అవమానాలకు గురి చేసిన కిమ్, తాజాగా ఒలింపిక్స్ లో పతకం గెలవడంలో విఫలమైన అథ్లెట్ల విషయంలోనూ తన శాడిజం చూపిస్తున్నాడు.

పతకాలు గెలవలేకపోయిన క్రీడాకారులకు ఇల్లు లేకుండా చేయడమే కాక, వారికి సరైన తిండి కూడా దొరక్కుండా చేయబోతున్నాడట. అంతే కాదండోయ్, కొందరిని బొగ్గు గనుల్లో పని చేసేలా కూడా శిక్ష విధిస్తున్నాడట. ఇదంతా పక్కన పెడితే, పతకాలు గెలిచిన వాళ్లకు మాత్రం భారీ నజరానాలే ఇవ్వనున్నాడు కిమ్. వారికి ఖరీదైన బంగ్లాలు.. కార్లతో పాటు అనేక బహుమతులు సిద్ధంగా ఉన్నాయి. రియో ఒలింపిక్స్ లో ఉత్తర కొరియా క్రీడాకారులు 7 పతకాలు సాధించారు. పాలన విషయంలో ప్రపంచాన్ని అనుసరించకుండా.. నియంతృత్వాన్ని కొనసాగిస్తున్న కిమ్.. ప్రజాస్వామ్య దేశాలు పోటీ పడే ఒలింపిక్స్ లో పతకాలు గెలవడాన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, మెరుగైన ప్రదర్శన చేయని క్రీడాకారుల్ని శిక్షించడం ఏం న్యాయమో అంటూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తుంటే, మరికొందరు భలే భలే అంటున్నారు.

English summary

Punishment for athletes in North Korea