బస్సుల్లో ఇక ఆ పాటలకు చెల్లు చీటీ

Punjab banned playing of vulgar songs in buses

04:34 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Punjab banned playing of  vulgar songs in buses

ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల్లో అసభ్యకర పాటలను పెట్టడంపై పంజాబ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర రవాణా మంత్రి అజిత్‌ సింగ్‌ కోహార్‌ ప్రకటించారు అశ్లీల, రెచ్చగొట్టే పాటలను బస్సుల్లో పెట్టకుండా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంటూ, ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను డ్రైవర్లు ధిక్కరించినట్లయితే కఠిన చర్యలు తప్పవ ని హెచ్చరించారు. ప్రయాణికులకు మేలైన సేవలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెబుతూ, అసభ్యకర పాటలతో ప్రజలు ఇబ్బంది పడటమే గాక.. డ్రైవర్‌ దృష్టి మళ్లి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయ ని ఆయన అన్నారు. . ఓ ప్రత్యేక కమిటీ బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నిబంధనల అమలును పర్యవేక్షిస్తుందన్నారు. ఏ డ్రైవరైనా ఆదేశాలను ఉల్లంఘించినట్లు కన్పిస్తే.. సామాన్య ప్రజలు వ్యక్తిగతంగా తనను కలిసి ఫిర్యాదు చేయవచ్చని మంత్రి అజిత్‌సింగ్‌ సూచించారు. పంజాబ్ లోని ఆర్టిసి బస్సుల్లో ఇటీవల అసభ్యకర పాటలు ప్రదర్శించడం పై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

English summary

Punjab Government has banned playing of vulgar songs in RTC buses.The directions have been passed by state Transport Minister Ajit Singh Kohar who warned that any bus driver found violating government's directive would have to face strict departmental action.