తుపాకీతో కాల్చేసుకున్న మాజీ సీఎం మనవడు

Punjab Ex Chief Minister Grandson Commits Suicide

12:37 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Punjab Ex Chief Minister Grandson Commits Suicide

దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న కొన్ని ఘటనలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. ఇది కూడా లాంటిదే. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు హర్కిరాత్ సింగ్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఛండీగఢ్‌లోని తన నివాసంలో హర్కిరాత్ సింగ్ ఆదివారం ఆ చర్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉన్న పీజిఐ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమాశాడు. కణతకు తుపాకీ గాయం ఉండటంతో లెసెన్స్డ్ రివాల్వర్‌తో కణతకు గురిపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేవి ఇంకా తెలియలేదు. తీవ్ర ఒత్తిడికి లోనై ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే తుపాకీ క్లీన్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు ఆయన కుటుంబ సభ్యులు చెప్పే మాట. పంజాబ్ లూథియానాలోని కోట్లి గ్రామం సర్పంచ్‌గా హర్కిరాత్ సింగ్ ఉన్నారు. ఆయన సోదరుడు గురుకీరిత్ సింగ్ కోట్లి.... ఖన్నా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, పోస్టుమార్టం అనంతరం ఆయన అంతక్రియలను సోమవారం జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:బెట్టింగ్ లో ఓడిపోయాడని భార్యను తాకట్టు పెట్టేసాడు! ఆమె ఏం చేసిందో తెలుసా?

ఇవి కూడా చదవండి:డేర్ ఉంటే నైట్ టైం ఈ హర్రర్ మూవీస్ ఒంటరిగా చూడండి

English summary

Former Punjab Ex- Chief Minister Beant Singh's grandson Harkirat Singh was committed suicide by firing gun. But the Family members were saying that this was happened when he was cleaning his Gun.