పూరీ-ఛార్మీ కంబైన్డ్ బిజినెస్ స్టార్ట్..

Puri and Charmi started combined business

11:51 AM ON 1st August, 2016 By Mirchi Vilas

Puri and Charmi started combined business

ఈరోజుల్లో ఎంత సంపాదించినా ఖర్చు కూడా ఎక్కువే ఉండడంతో రెండుచేతులా సంపాదించే పరిస్థితులు అందరికీ వస్తున్నాయి. ఇక సినిమా వాళ్ళైతే ఓ పక్క సినిమాలు మరోపక్క యాడ్స్, కుదరకపోతే సైడ్ బిజినెస్ లు చేయడం రివాజుగా మారింది. అందుకే ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలెబ్రిటీస్ సైడ్ బిజినెస్ చేయడం మామూలే. చిరంజీవి, నాగార్జున, మోహన్ బాబు, రామ్ చరణ్, తమన్నా.. లేటెస్ట్ గా బన్నీ అందరూ బిజినెస్ లు చేసేస్తున్నారు. ఇప్పుడు అవకాశాలు తగ్గిన ఛార్మీ కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తోందట. ఇప్పటికే పూరీ డైరెక్షన్ లో వచ్చిన జ్యోతిలక్ష్మీతో ఫిలిం ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది.

ఇప్పుడు డైరెక్టర్ పూరీతో కలసి ఛార్మీ ఈ క్యాస్టింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయబోతోందట. రీసెంట్ గా రాజ్ తరుణ్ సినిమాకు హీరోయిన్ గా అమైరా దస్తూర్ ని సెట్ ఛార్మీయే చేసిందట. ఈ కాన్సెప్ట్ నచ్చిన పూరీ కూడా ఛార్మీతో బిజినెస్ చేయడానికి రెడీ అయ్యాడట. ముమైత్ ఖాన్, అనుష్క, అసిన్ లతో పాటూ మరి కొంత మంది ఐటమ్ గాళ్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన పూరీ ఇప్పుడు తన సొంత క్యాస్టింగ్ ఏజెన్సీతో ఎంతమంది హాట్ హాట్ భామలని టాలీవుడ్ కి ఆకర్షిస్తాడో చూద్దాం.

English summary

Puri and Charmi started combined business