ఒకేసారి ఇద్దరినీ బుట్టలో వేసేసిన పూరి

Puri Jaganadh confirms movie with NTR and Kalyan Ram

03:34 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Puri Jaganadh confirms movie with NTR and Kalyan Ram

ఒకరిని ఒప్పించడమే కష్టం ... అలాంటిది ఇద్దరినీ ఏకకాలంలో ఒప్పించడ మంటే మాటలా ... కానీ సాధ్యం చేసేసి చూపాడు పూరి జగన్నాథ్‌.... అవును, పైగా నందమూరి బ్రదర్స్ ని ... వివరాల్లలోకి వెళితే, నెలరోజుల్లో సినిమా పూర్తి చేయగల దిట్ట అయిన పూరీ, బుధవారం హైదరాబాద్‌లో కల్యాణ్‌రామ్‌కి ఓ కథ చెప్పి.. ‘ఓకే’ చేయించుకున్నాడు. ఇదే అదనుగా అక్కడే ఉన్న ఎన్టీఆర్‌కీ ఓ కథ వినిపించేయడం, అది కాస్తా ఎన్టీఆర్‌కి బాగా నచ్చేయడంతో ఈ సినిమా కూడా ఖాయమైపోయింది. ‘టెంపర్‌’తో ఎన్టీఆర్‌ని సరికొత్త కోణంలో చూపించిన పూరి, తాజాగా కధ ఒకే అవ్వడంతో ‘ఎన్టీఆర్‌తో మరో సినిమా ఉంటుంద’ని ప్రకటించాడు. అసలే ఓ హీరోకి కధ చెప్పి ఒకే చేయించడం తలకు మించిన భారం అవుతున్న రోజుల్లో, ఓ పక్క కళ్యాణ్ రామ్ ని రెడీ చేయించి, మరో కథ సిద్ధం చేసి, ఎన్టీఆర్‌కి చెప్పి ఒప్పించడం నిజంగా మిరాకిల్ అంటున్నాయి సినీ వర్గాలు. .... ‘‘పూరి దర్శకత్వంలో మళ్లీ ఎన్టీఆర్‌ నటించబోతున్నాడు. ఈ సినిమా ఎప్పుడు, నిర్మాత ఎవరు? అనే విషయాల్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అని పూరి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి నందమూరి బ్రదర్స్ తో రెండు సినిమాలు తీసేస్తున్న పూరి ఈ కొత్త సంవత్సరంలో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.

English summary

Tollywood Sensational Director Puri Jaganadh confirms movie with both NTR and Kalyan Ram.Recently Puri said story to Kalyan Ram and He accepted that story and puri also said another story to NTR and that story line was liked by NTR and he also accepted puri movie.Previously Puri Jaganadh gave super hit to NTR with Temper Movie