వర్మకు షాకిచ్చిన పూరీ!!

Puri Jagannadh gave counter to Ram Gopal Varma

03:38 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Puri Jagannadh gave counter to Ram Gopal Varma


సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌వర్మ ఎప్పుడూ వివాధాల్లోనే చిక్కుకుంటాడు . కానీ తాజాగా వర్మకి మరోషాక్‌ తగిలింది. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు పూరీజగన్నాధ్‌ ఎప్పుడూ గురువు బాటలోనే నడుస్తాడు. కానీ దానికి విరుద్ధంగా తొలిసారి వర్మకి యాంటీగా పూరీ కామెంట్‌ చెయ్యడం దీనికి కారణం. తాజాగా అమీర్‌ఖాన్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు పై వర్మ అమీర్‌ను విమర్శించాడు. అదేంటంటే భారత్‌లో అసహనమే ఉంటే బాలీవుడ్‌ స్టార్‌ హీరోలుగా ఖాన్‌ లే ఎలా అయ్యారంటూ వర్మ విమర్శించాడు. ఆ విమర్శలకు స్పందిస్తూ పూరీ వర్మకు ఎదురెళ్ళాడు.

తెలివి తక్కువ వాళ్లే అమీర్‌ని విమర్శిస్తున్నారని, అమీర్‌ బాధ ఎవరూ అర్ధం చేసుకోవడం లేదని, ప్రతి ఒక్కరూ దీన్ని ఓ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని శుక్రవారం పూరీ ట్వీట్ చేశాడు. అమీర్‌ పెద్ద సెలబ్రిటీ కావడం వల్లే ఆయన్ని అలా విమర్శిస్తున్నారని ఒకవేళ ఆయన ఆల్‌ ఖైదా లేదా ఐఎస్‌ఐఎస్‌ లాంటి వారైతే ఏ ఇండియన్‌ అయినా ఇలా విమర్శించే ధైర్యం చేసేవాడా అని పూరీ పేర్కొన్నాడు. ఈ ట్వీట్తో పూరీ అసలు ఇది అమీర్‌ని విమర్శించిన వాళ్ళకి కౌంటర్‌ వేశాడా లేక డైరెక్ట్‌గా వర్మకే వేశాడా? ఇది జస్ట్‌ ట్వీటేనా లేక ఇది వైరంగా మారనున్నదా అన్న సందేహాలు వస్తున్నాయి.

English summary

Puri Jagannadh gave counter to Ram Gopal Varma for Amir Khan.