మల్టీ స్టారర్ కోసం కుర్ర హీరోలను పోగేస్తున్న పూరి

Puri Jagannadh Multi Starrer Movie

02:52 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Puri Jagannadh Multi Starrer Movie

ఒకప్పుడు మల్టీ స్టారర్ చిత్రాలు బోల్డన్ని వచ్చేవి. అగ్రహీరోలు సైతం ఎలాంటి భేషజాలకు పోకుండా మల్టీ స్టారర్ అంటే ఒకే అనేవారు. అలనాడు గుండమ్మ కథ , మిస్సమ్మ , దేవుడు చేసిన మనుషులు , గురు శిష్యులు, మండే గుండెలు, ముందడుగు ఇలా ఎన్నో సినిమాలు మనకు కనిపిస్తాయి. కానీ రానురాను మల్టీ స్టారర్ లు తగ్గాయి. ఎదో అడపాదడపా ఒకటో రెండో మల్టీ స్టారర్ తళుక్కుమంటున్నాయి. అయితే పెద్ద హీరోల కంటే కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ కోసం దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రయత్నం చేస్తున్నాడట. నిజానికి పూరి ఏ సినిమా చేసినా కూడా అది సంచలనాత్మకంగా ఉంటుంది. రిలీజ్ తరువాత రిజల్టు ఎలా ఉన్నా కూడా.. రిలీజుకు ముందు మాత్రం కేవలం టైటిల్, క్యాస్టింగ్ తో హైప్ తెచ్చేస్తాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో చేస్తున్న ''ఇజం'' సినిమా పూర్తవ్వగానే మనోడు మహేష్ బాబుతో ''జనగనమణ'' సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంతకంటే ముందు ఓ చిన్న ప్రాజెక్టు చేస్తున్నాడట. వివరాల్లోకి వెళ్తే,

ఓ ఇద్దరు కుర్ర హీరోలతో పూరి జగన్ మల్టీ స్టారర్ సినిమా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుర్ర హీరో నాగ శౌర్యను ఒక హీరోగా ఎంచుకున్న పూరి.. పెళ్లి చూపులతో సోలో సక్సెస్ కొట్టిన విజయ్ దేవరకొండను మరొక హీరో పాత్రలోకి దించాలని చూస్తున్నట్లు టాక్. అంతే కాదు ఇదొక యాక్షన్ లవ్ డ్రామా అని తెలుస్తోంది. ఒకే అమ్మాయి కోసం ఇద్దరి మధ్యన జరిగే సమరం అనమాట. అయితే హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ప్రస్తుతం హీరోయిన్ను ఫిక్స్ చేసే పనిలో ఛార్మి ఉన్నట్లు టాక్.

మొత్తానికి పూరి జగన్ సినిమాలో చేయడం అంటే గొప్ప విషయమే కదా అని కుర్ర హీరోలు అనుకుంటున్నారట. ఖచ్చితంగా నాగ శౌర్య అండ్ విజయ్ దేవరకొండను కొత్త డైమన్షన్ లో ఈ డైరక్టర్ ప్రెజంట్ చేస్తాడు . తద్వారా వారి ఇమేజ్ చేంజ్ అయిపోతుంది. కొత్త ప్రయోగంలో పూరి సక్సెస్ కావాలని సినీలవర్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:గతజన్మలో ప్రేమించిన వ్యక్తిని.. ఇప్పుడు కలిశామని చెప్పే సంకేతాలు!

ఇవి కూడా చదవండి:బాహుబలి-2 రిలీజ్ డేట్ మళ్ళీ చేంజ్..!

English summary

Tollywood Sensational Director Puri Jagannadh was planning to make Multi starrer movie with young hereos like Naga Showrya and Vijay Devarakonda.