బీడీలు కాల్చండి బాబులూ..

Puri Jagannadh posted about Jagapathi Babu in twitter

11:15 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Puri Jagannadh posted about Jagapathi Babu in twitter

పొగ తాగడం హానికరం అంటారు గానీ చుట్టా, బీడీ, సిగరెట్ తాగేవాళ్ళు ఏమాత్రం ఆగడం లేదు. పైగా అందులో ఏదో మజా ఉందని అంటారు. ఇక సినిమాల్లో కూడా వీటి పై పాటలు వచ్చాయి. డైలాగులు పేలుతున్నాయి. ఇంతకీ అసలు విషయానికి వస్తే, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. చాలా గ్యాప్ తర్వాత జగపతిబాబుతో సినిమా చేస్తున్నాడు. హీరో కళ్యాణ్ రామ్ తో తను తీస్తున్న మూవీలో జగ్గూ దాదా కీలకమైన రోల్ ప్లే చేస్తున్న నేపథ్యంలో.. పూరీ ఎన్నో ఏళ్ళ తర్వాత జగపతి బాబుతో కలిసి పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందంటూ తన ట్విటర్ లో జగ్గూ ఫొటో పెట్టాడు.

పైగా కళ్యాణ్ రామ్, జగపతిబాబులకు బీడీలు వెలిగించుకోవడానికి లైటర్ తో సాయం చేస్తున్న ఫోటోను కూడా పోస్ట్ చేసి తన సరదా తీర్చుకున్నాడు. వావ్.. పూరీ, జగ్గూ, కళ్యాణ్ రామ్ కాంబోతో కూడిన ఈ మూవీ అదుర్స్ అనిపించేలా ఉండదూ... మరి అని నెటిజన్లు సెటైర్లు కుమ్మేస్తున్నారు.

English summary

Puri Jagannadh posted about Jagapathi Babu in twitter