పూరీ జగన్నాధ్‌కి 30 కోట్లు పారితోషికం!!

puri jagannadh taking 30 crores remmuneration

12:09 PM ON 24th November, 2015 By Mirchi Vilas

puri jagannadh taking 30 crores remmuneration

టాలీవుడ్‌ స్పీడ్ డైరెక్టర్‌ పూరీజగన్నాధ్‌ హీరోలని స్క్రీన్‌ మీద ప్రెజెంట్‌ చెయ్యడంలో తనకంటూ ఒక స్టైల్‌ని ఏర్పరుచుకున్నారు. హీరోలని ప్రెజెంట్‌ చెయ్యడంలో పూరీకున్న స్టైల్‌ వేరే ఏ టాలీవుడ్‌ డైరెక్టర్‌కి లేదనడంలో అతిశయోక్తిలేదు. ఇందువల్లే పూరీ టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా వెలిగొందుతున్నారు. పూరీ టాలెంట్‌ చూసే చిరంజీవి తన కుమారుడు రామ్‌చరణ్‌ ని తెలుగు తెరకి పరిచయం చేసే అవకాశాన్ని పూరీకి ఇచ్చాడు. ఆ చిత్రమే చిరుత సూపర్‌ హిట్‌ కాకపోయిన హీరోని ప్రెజెంట్‌ చెయ్యడంలో మంచి మార్కులే కొట్టేశారు.

పూరీకి మార్కెట్లో ఉన్న డిమాండ్‌ ప్రకారం ఒక్కసారిగా 30 కోట్లు పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. పూరీ జగన్నాధ్‌ ఇద్దరు కొత్త హీరోలని పరిచయం చేయబోతున్నాడు. నిర్మాతైన సి.ఆర్‌. మనోహర్‌ కుమారుడు ఇషాన్‌ ఒకరు, మాజీ భారత ప్రధానమంత్రి దేవా గౌడ్‌ కుమారుడు నిఖిల్‌ గౌడ మరొకరు. ఈ ఇద్దరినీ పూరీనే లాంచ్‌ చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలకు గాను ఒక్కొక్క దానికి పూరీ 15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. మొత్తం 30 కోట్లు భారీ పారితోషికాన్ని అందిపుచ్చుకున్నాడు.

English summary

puri jagannadh taking 30 crores remmuneration