‘అల్లరి’తో పూరి?

Puri Jagannadh To Direct Allari Naresh

10:27 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Puri Jagannadh To Direct Allari Naresh

పూరి జగన్నాథ్.. టాలీవుడ్ లో మాస్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. మూడు నెలల నుంచి 45 రోజుల సమయం దొరికితే చాలు.. సినిమా తీసి పడేస్తాడు పూరి.. ఇక కామెడీలో సూపర్ టైమింగ్ ఉన్న నటుడు అల్లరి నరేష్. కామెడీ అనే కాదు డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడంలోనూ పెర్ఫక్టే. కానీ ఇప్పుడు వీళ్లిద్దరి టైమ్ అంత బాగా లేదు. ఇద్దరూ ప్లాపుల్లో కష్టాలు పడుతున్నారు. దీని నుంచి బయటపడేందుకు వీరిద్దరూ చేయని ప్రయత్నం లేదు. కానీ నో యూజ్. దీంతో వీరిద్దరూ ఓ సినిమా చేసేందుకు సిద్దమవుతున్నారట. రెండు విభిన్నమైన పంధా ఉన్న వీరిద్దరి కాంబినేషన్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు పూరి కళ్యాణ్ రామ్ తో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. తర్వాత మహేష్ బాబుతో సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఈ రెండు చిత్రాలకు మధ్య కాస్త గ్యాప్ దొరికితే అల్లరి నరేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట పూరి. ఇక నరేష్ ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ లో జి.నాగేశ్వర్ రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమాను చేసే యోచనలో ఉన్నాడు. మరి పూరి-అల్లరి నరేష్ ల క్రేజీ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందో లేదో త్వరలోనే క్లారిటీ రానుంది.

English summary

Tollywood's Sensational director Puri Jagannadh to direct comedy hero Allari Naresh.Presently Puri Jagannadh was planning to Make movie with Nandamuri Hero Kalyan Ram and on the other Side Allari Naresh was also palnning to act under BVSN Prasad production.