మహేష్‌ తో పూరీ 'పోకిరి-2'

Puri Jagannadh to make sequel with Mahesh Babu

03:53 PM ON 17th February, 2016 By Mirchi Vilas

Puri Jagannadh to make sequel with Mahesh Babu

మాస్‌ చిత్రాలు తెరకెక్కించడంలో పూరీ జగన్నాధ్‌ దిట్ట. పూరీ మహేష్‌ తో చేసిన 'పోకిరి' చిత్రం ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రమే మహేష్‌ని అగ్రతారగా నిలబెట్టింది. ఈ చిత్రం తరువాత పూరీ మహేష్‌ తో 'బిజినెస్‌ మేన్‌' చిత్రం కూడా ఘన విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్‌ ఒక ట్రెండ్‌గా మారిపోయింది. అయితే 'బిజినెస్‌ మేన్‌' తరువాత వీరిద్దరి కాంబినేషన్‌ లో మళ్ళీ చిత్రం లేదు. అయితే మళ్ళీ ఇప్పుడు పూరీ మహేష్‌ కోసం ఒక కథ సిద్దం చేశాడట. ఆ కథని మహేష్‌కి వినిపిస్తే చాలా బాగుందని వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసినట్లు సమాచారం. ఈ చిత్రం మరో 'పోకిరి-2' కాబోతుందని ఫిలిం వర్గాలు సమాచారం. మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత మహేష్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తాడు. దాని తరువాత పూరీ దర్శకత్వంలో నటిస్తాడని సమాచారం.

English summary

Mahesh Babu and Puri Jagannadh super hit film Pokiri was created history in Telugu film industry and now Puri Jagannadh was planning to make sequel of that movie.