మహేష్ కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పూరీ

Puri Jagannadh went to police station for Mahesh Babu

11:05 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Puri Jagannadh went to police station for Mahesh Babu

అవునా, సూపర్ స్టార్ మహేష్ ఏమి చేసాడు.. అతని కోసం స్టేషన్ కి డైరెక్టర్ పూరీ ఎందుకు వెళ్లినట్టు? ఎప్పుడూ ఏదో ఒక సినిమా హంగామాతో బిజీగా ఉండే పూరీ జగన్నాథ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కనిపించడమే ఇందుకు కారణం. ఆయన స్టేషన్ కు వచ్చారని తెలియగానే ఒకరి తర్వాత ఒకరు మీడియా అంతా స్టేషన్ ముందు గుమికూడింది. కానీ లోపలికి వెళ్లిన పూరీ ఎంతకీ బయటకు రాలేదు. దాంతో ఏ కేసులో వచ్చి ఉంటాడనే విషయం పై కానిస్టేబుల్స్ ని ఆరా తీసినా కూడా మాకు తెలియదు, ఆయనే వచ్చారని చెప్పారు. ఇటు ఇతర అధికారులు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు.

దాదాపు గంట తర్వాత బయటకు వచ్చిన పూరీ అసలు విషయాన్ని కూల్ గా చెప్పాడు. నేను స్టేషన్ కు వచ్చిన విషయం ఎవ్వరికి చెప్పకపోయినా మీకు మాత్రం తెలుస్తుందని పంచ్ వేసిన పూరీ… అసిస్టెంట్ కమిషనర్ ఉదయ్ కుమార్ రెడ్డి స్నేహితుడని, అందుకే కలవడానికి వచ్చానని అన్నాడు. కానీ ఓ సినిమా కథలో పోలీస్, రౌడీలకు సంబంధించిన కేసుల విషయంలో రియల్ టైమ్ లో పోలీసులు ఎలా హాండిల్ చేస్తారు? ఎలా విచారిస్తారు? ట్రీట్మెంట్ తో ఎలా నిజాలను రాబడతారనే దాని పై డీటేల్స్ తెలుసుకోవడం కోసమే పూరీ వచ్చినట్లు టాక్. అయితే ఆ కథ మహేష్ బాబుదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆయన కథ కోసమే పోలీస్, విలన్లు, కేసులు, పొలిటిషయన్స్ గురించి ఆరా తీశారని, వాటికి అనుగుణంగానే కథను, సీన్లను రాసుకుంటారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అందులో మహేష్ పోలీసా కాదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఘటన పెద్ద టాక్ అయింది.

English summary

Puri Jagannadh went to police station for Mahesh Babu. Speed director Puri Jagannadh went to police station for Mahesh Babu.