ఇద్దరి మధ్యా కుదిరింది సయోధ్య

Puri Jagannath and Chiranjeevi compromise

10:48 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Puri Jagannath and Chiranjeevi compromise

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని, ఇప్పుడు 150 సినిమా పై దృష్టి సారించిన మెగాస్టార్ చిరంజీవి, హిట్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ మూవీస్ దర్శకునిగా పేరొందిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మధ్య ఇంతకాలానికి సయోధ్య కుదిరిందట. గతంలో చిరు 150 వ మూవీ కోసం పూరి రెడీ చేసిన స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయన్న వార్తలు హాట్ హాట్ గా చక్కర్లు కొట్టాయి. ఈప్రభావంతో కొంతకాలం ఇద్దరూ ఎవరికివారు ముభావంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

మెగాస్టార్ తన స్క్రిప్ట్ పట్ల చూపిన విముఖత తో పూరి చాలా అప్ సెట్ అయ్యాడన్న రూమర్లు షికార్లు చేశాయి. కానీ ఈ మధ్య చిరంజీవి మనసు మళ్ళీ మెత్తబడిందట. తిరిగి చక్కని స్టోరీతో తన వద్దకు రావాలని పూరీని కోరాడని, దీంతో పూరీ కూడా హ్యాపీగా ఓకె అన్నాడని అంటున్నారు. ఇద్దరు సినీ దిగ్గజాలు కలిసిన కొత్త ప్రాజెక్ట్ ఎలాంటి అడ్డంకులు లేకుండా స్టార్ట్ అయితే దాని కిక్కు వేరబ్బా!

ఇది కూడా చూడండి: జక్కన్న తండ్రితో అజయ్ దేవగన్

ఇది కూడా చూడండి: ఎత్తు పెరగాలంటే ఇవి తినాల్సిందే

ఇది కూడా చూడండి: గిర్రున ఏడాది తిరిగేసిన బాహుబలి - కేక పెట్టించిన మేకింగ్ వీడియో

English summary

Chiranjeevi and Puri Jagannath compromise. Both are patched up again. They were working together for their upcoming Movie.