పుర్రెలతో దిమ్మతిరిగే పోస్టింగ్ ఇచ్చిన పూరి

Puri Jagannath posts heart touching post in social media

11:04 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Puri Jagannath posts heart touching post in social media

సింగిల్ లైన్ పంచ్ డైలాగ్స్ స్టార్ హీరోల నోట పలికించి, ప్రేక్షకుల చేత సెహ్ బాష్ అనిపించుకున్న పూరి సినిమాల రూటే వేరు. అంతేకాదు, ఒక్క డైలాగ్ తోనే ప్రేక్షకులను అలరించగలిగే పూరీ తన ఆలోచనలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూంటాడు. అయితే ఆ పోస్టుల వెనకున్న అర్థాలు సైతం డెప్త్ గా ఉంటాయి. తాజాగా పూరి పోస్ట్ చేసిన ఈ ఫొటోలో.. వరుసగా పుర్రెల బొమ్మలు వాటికింద సమాజంలోని పలు మతాలు, కులాలు, వివిధ స్థాయిలు, జెండర్స్ మెన్షన్ చేయబడి ఉన్నాయి. అయితే అన్ని పుర్రెలు ఒకేలా ఉండటం గమనార్హం. కులాలు, మతాలు, ఆడ-మగ, ధనిక-పేద, చివరికి నువ్వు, నేను ఇలా అందరి మధ్యా ఎన్ని తేడాలు, భేదాలు ఉన్నా... అంతర్గతంగా అందరి పుర్రెలు ఒకలా ఉంటాయన్న సారాంశం ఎంతో క్రియేటివ్ గా తెలియచెప్పాడు.

చివరగా మనుషులంతా ఒక్కటన్నదే పూరి భావన. మొత్తానికి ఈ పోస్ట్ ఒకటి ఇప్పుడు నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. తెగ హల్ చల్ చేసేస్తోంది. కామెంట్స్ కూడా బానే పడుతున్నాయి.

English summary

Puri Jagannath posts heart touching post in social media