పూరి చెప్పిన రెండు పావురాల కథ

Puri Jagannath speech in Isam audio launch

01:20 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Puri Jagannath speech in Isam audio launch

దమ్మున్న దర్శకుడు పూరి జగన్నాధ్ అని టాలీవుడ్ లో విన్పించేమాట. అలాంటి పూరి జగన్నాథ్ కు నందమూరి హరికృష్ణ రెండు పావురాలు కానుకగా ఇచ్చాడట. అవి గుడ్లు కూడా పెట్టాయని.. త్వరలోనే వాటిని తీసుకుని కుటుంబంతో హరికృష్ణను కలుస్తానని అంటున్నాడు. ఇంతకీ ఈ పావురాలేంటి.. హరికృష్ణ వాటిని పూరికి గిఫ్ట్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా? ఇజం ఆడియో వేడుకలో పూరి చెప్పిన ఈ కథేంటో కొంచెం చదవండి. 'ఇజం' టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది తన నాన్న హరికృష్ణకు చాలా బాగా నచ్చేయడంతో కళ్యాణ్ రామ్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఆ టీజర్ హరికృష్ణ గారికి ఎంతగా నచ్చిందంటే ఆయన ముచ్చటపడి నాకు రెండు పావురాల్ని కానుకగా ఇచ్చారు. అవి నా దగ్గరే పెరుగుతున్నాయి.

గుడ్లు కూడా పెట్టాయి. ఆ పిల్లలు పెద్దవయ్యాక తీసుకుని ఫ్యామిలీతో హరికృష్ణగారిని కలుస్తా అని పూరి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అదరగొట్టేశాడట. కళ్యాణ్ పెర్ఫామెన్స్ చూసి హరికృష్ణగారు ప్రౌడ్ ఫీలవుతారు. ముఖ్యంగా ఇందులో ఓ కోర్ట్ సీన్ ఉంటుంది. అద్భుతంగా వచ్చింది. ఈ సీన్ చూసి ఎన్టీఆర్ చాలా ఎగ్జైట్ అయి అరిచేశాడు. కోర్టు సీన్లంటే నందమూరి హీరోలవే. ఇందులోనూ ఆ సీన్ బాగా వచ్చింది. మామూలుగా తమ సినిమా బాగుందని చెప్పడానికే ఎవరైనా ఆడియో వేడుక పెడతారు. అయితే మా సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా పెద్ద హిట్టవుతుంది అని పూరి చెప్పుకొచ్చాడు.

English summary

Puri Jagannath speech in Isam audio launch