'మున్నాభాయ్' తో పూరి

Puri Jagannath To Direct Sanjay Dutt

09:35 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Puri Jagannath To Direct Sanjay Dutt

తెగింపు, చొరవ గల డైరెక్టర్ పూరి జగన్నాధ్ వెరైటీ ఇష్టపడతాడు. చిన్నవాళ్ళతో తీసినా , అగ్ర హీరోలతో తీసినా సేన్షేషన్ క్రియేట్ చేయడం పూరి సొత్తు. అందుకే గత ఏడాది కొత్తదనంతో ‘టెంపర్’, ‘జ్యోతిలక్ష్మి’, ‘లోఫర్’ సినిమాలను తెరమీదికి తీసుకొచ్చిన పూరి ప్రస్తుతం ‘రోగ్‌’ని ముస్తాబు చేసే పనుల్లో బిజీ అయ్యాడు. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా కొద్ది రోజుల్లో పూర్తి అయిపోతుంది. ఇక ఓ పక్క ఎన్టిఆర్ , కళ్యాణ్ రామ్ లతో కూడా రెడీ అవ్వడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు మరో చాన్స్ తీసుకుంటున్నాడు. అదేమంటే ఇటీవలే జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌తో డాషింగ్ డైరక్టర్ పూరి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు మొదలెట్టేశాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా అయిపోయి, పూరి కథకు గ్రీన్ సిగ్నల్ సంజయ్ దత్ నుంచి గ్రీన్ సిగ్నల్ పడిందట. అయితే మున్నాబాయ్ సిరీస్‌లో ఓ సినిమా చేయాల్సుండడం వలన ఆతర్వాతే పూరి సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈలోపు కళ్యాణ్ రామ్‌ సినిమాని పూర్తి చేయాలన్నది పూరి పక్కా ప్లాన్ వేసుకున్నాడట. పూరికి బాలీవుడ్ ఏమీ కొత్తకాదు. గతంలో ‘బద్రి’ రీమేక్‌తోపాటు అమితాబ్ హీరోగా ‘బుడ్డా హోగా తేరా బాప్’ సినిమాలు చేసిన పూరి జగన్నాధ్‌కి బాలీవుడ్‌లో దత్ తో తీసే సినిమా మూడో సినిమా అవుతుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్‌ల కోసం కూడా కథలు సిద్ధం చేస్తున్నానంటూ ఆ మధ్య పూరి చెప్పాడు కదా. ముంబై ఫ్లైట్ దిగాకే అవి సెట్స్‌పైకెళ్లతాయేమో మరి. మొత్తానికి టాలీవుడ్ , బాలీవుడ్ లలో పూరి దూసుకు పోతున్నాడనే చెప్పాలి.

English summary

One of the top director in Tollywood Puri Jagannath to direct Munna Bhai Sanjay Dutt . After releasing from Jail Sanjay Dutt Was planning to make films and recently according to a news Puri Jagannath said story line to Sanjay Dutt and he also said ok for that to do movie.