వెంకీ @75 - పూరితో ఘర్షణ -2

Puri Jagannath To Direct Venkatesh 75th Movie

11:28 AM ON 9th May, 2016 By Mirchi Vilas

Puri Jagannath To Direct Venkatesh 75th Movie

అగ్ర హీరోలు చిరంజీవి 150వ చిత్రం, బాలయ్య వందో చిత్రం కోసం..అలాగే వెంకీ 75వ చిత్రాన్ని ప్రెస్టేజీయస్ సినిమాలుగా భావిస్తున్నారు. టాప్ హీరోస్‌ తమ ల్యాండ్ మార్క్ మూవీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో చిరు, బాలయ్య చిత్రాలు ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమవ్వగా, ఈ సినిమాలు 2017లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక వెంకీ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 73వ సినిమా ‘బాబు బంగారం’లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ‘నేను శైలజ’ ఫేం కిశోర్ తిరుమల డైరెక్షన్‌లో 74వ సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత ప్లాటినం జూబ్లీ సినిమాగా రూపొందనున్న తన 75వ చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వెంకటేష్‌ను కలిసి పూరి ఒక లైన్ వినిపించడం, దానికి వెంకీ డెవలప్ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయని అంటున్నారు. కాగా పూరి కూడా ఇటీవల కళ్యాణ్ రామ్‌తో ఓ సినిమా మొదలుపెట్టగా..తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబుల పేర్లు వినిపిస్తున్నాయి..అలాంటప్పుడు వెంకీతో సినిమా ఎప్పుడు ప్రారంభిస్తాడో వేచి చూడాలి. వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోతుందని టాక్.

ఇవి కూడా చదవండి: పిల్లాడే కదా అని ముద్దులు కురిపిస్తే ..

ఇవి కూడా చదవండి: అసలు అక్షయ్ కి ఏం జరిగింది - సారీ ఎందుకు చెప్పాడు

ఇవి కూడా చదవండి: రాజీవ్‌ కనకాల చెంప పగలగొట్టిన రష్మీ

English summary

Victory Venkatesh was going to act under Director Puri Jagannadh as his 75th movie. Presently Venkatesh was acting under the Direction of Maruthi in a film named "Babu Bangaram".