నాకు పవన్‌ దేవుడు

Puri Says Pawan Kalyan Was His God

01:29 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Puri Says Pawan Kalyan Was His God

మెగా ఫ్యామిలీకి చెందిన ఏ ఫంక్షను అయినా అభిమానులందరూ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడాలని అడుగుతుంటారు . ఇటీవల జరిగిన లోఫర్‌ ఆడియో ఫంక్షన్‌ లో కూడా పవన్‌...పవన్‌... అంటూ అభిమానులు రచ్చరచ్చ చేసారు. దీంతో ప్రభాస్‌ సైతం 'లైక్‌ పవర్‌ స్టార్‌' అని వ్యాఖ్యానించక తప్పలేదు . ఇలా ప్రతి ఆడియో ఫంక్షన్‌లో పవన్‌కళ్యాణ్‌ అభిమానులు అరుస్తుండడంతో పూరి జగన్నాధ్‌ కాస్త అసహనానికి గురయ్యాడు. ఇలాంటి చర్యల వల్ల పవన్‌కళ్యాణ్‌ ఇమేజ్‌ దెబ్బ తింటుందని ఈ విషయం పై పవన్‌కళ్యాణ్‌ తన అభిమానులతో మాట్లాడితే బాగుంటుందని పూరి అన్నాడు. ఈ వ్యాఖ్యల పై పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ అందరూ పూరిపై మండి పడ్డారు.

ఇది ఇలా ఉంటే ఇటివల విజయవాడలో జరిగిన లోఫర్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌లో కూడా పూరి మాట్లాడుతున్నప్పుడు పవన్‌ ఫ్యాన్స్‌ జై పవన్‌...జై జై పవన్‌ అంటూ పవన్ అభిమానులు అరవడంతో పూరి జగన్నాధ్‌ స్పందిస్తూ " పవన్‌కళ్యాణ్‌ మీకు కేవలం పవర్‌స్టారే... కానీ నాకు దేవుడు అంటూ పూరి జగన్నాధ్‌ " అనడంతో పవన్‌ అభిమానులు శాంతించారు.

English summary

Puri jagannadh says that power star pawan kalyan was his god. He says this in Loafer movie platinum disc function which was held in Vijayawada