మళ్లీ పెళ్లి చేసుకున్న పుతిన్‌ మాజీ భార్య

Putin Ex-Wife Remarries

04:56 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Putin Ex-Wife Remarries

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాజీ భార్య ల్యుద్మిలా పుతినా ఇటీవల రహాస్యంగా పెళ్లిచేసుకున్నారట. అది కూడా తనకంటే 21 ఏళ్ల చిన్నవాడిని. ఈ విషయం ఇప్పుడు రష్యా వెబ్‌సైట్లలో హల్‌చల్‌ చేస్తోంది. ల్యుద్మిలా అధికారికంగా తన పేరు మార్చుకున్నారని పేర్కొంటూ ప్రచురించిన కథనంలో ఆమె పేరులో ఇప్పుడు పుతినా లేదని, ల్యుద్మిలా ఒకెరెత్నయాగా మార్చుకున్నారని రాసింది. అది ఓ వ్యాపారి ఇంటిపేరని తెలిపింది. రష్యాకు చెందిన 37 ఏళ్ల వ్యాపారి అర్తుర్‌ ఒకెరెత్నీని ల్యుద్మిలా రహస్యంగా వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఇటీవల వీరిద్దరి ఫొటోలు వార్తల్లో కనిపించాయి. అయితే దీని పై ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. రష్యాలో వివాహ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సర్టిఫికెట్లను బహిరంగపరచరు. మరోవైపు ల్యుద్మిలా పెళ్లిపై మాట్లాడేందుకు పుతిన్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. వారిద్దరూ ఎప్పుడో విడిపోయారని.. ఇప్పుడు ఆమె వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. 2013 జులైలో పుతిన్‌ ల్యుద్మిలా నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ల్యుద్మిలా మీడియాకు దూరంగా ఉంది.

English summary

Russia President Vladimir Putin’s former wife Lyudmila marries again .She was married to the head of a company reportedly operating under her patronage, an investigation by Russian news website