రష్యాను నమ్మట్లేదు: పుతిన్

Putin Talks About Russia

04:17 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Putin Talks About Russia

యూనియన్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్(యూఎస్ఎస్ఆర్) పతనమై పాతికేళ్లు కావస్తున్నా ఇప్పటికీ రష్యాను ప్రపంచం నమ్మడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యా పునర్మిర్మాణంపై పశ్చిమదేశాలు వ్యక్తంచేస్తున్న అనుమానాలపై ఆయన తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. రష్యా మరోసారి యూఎస్ఎస్ఆర్ ను నిర్మిస్తోందంటూ అమెరికా, యూరప్ అంతటా చెలరేగుతున్న పుకార్లను ఆయన ఖండిచారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని బూచిగా చూపెడుతూ తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రష్యాపై పశ్చిమదేశాలు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దంటూ పుతిన్ మాట్లాడిన డాక్యుమెంట్.. పబ్లిక్ రష్యా ఛానెల్ లో సోమవారం ప్రసారమైంది. 'మేం యూఎస్ఎస్ఆర్ ను పునర్మించాలనుకోవట్లేదు. దురదృష్టం ఏంటంటే ఈ విషయాన్ని ప్రపంచం నమ్మట్లేదు' అని పుతిన్ అన్నారు. తామే సర్వజ్ఞులమని భావించే పశ్చిమదేశాలు.. ప్రపంచంలోని మిగతాదేశాలపై అభిప్రాయాలు రుద్దే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రదర్శించే ఆసక్తిలో సగమైనా ఆఫ్రికా, మధ్య ఆసియాలపై కేంద్రీకరించి ఉంటే భూగోళం పరిస్థితి మెరుగైఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రతిదేశానికి తనదైన సంస్కృతి, మతం, వారసత్వాలు ఉంటాయి. దీన్ని రష్యా గుర్తెరిగింది కాబట్టే యూఎస్ఎస్ఆర్ గురించి ఆలోచించట్లేదు. అయితే ఈ నిజాన్ని అమెరికా, యూరప్ దేశాలు ఎన్నటికీ అంగీకరించవన్నారు.

English summary

Russian President Putin says that world was not trusting russia.