స్మార్ట్‌ఫోన్లను అలాంటి చోట్ల పెట్టుకుంటే ఇక రోగాలే?

Putting Cell Phones In Pockets May Damage Your Health

10:37 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Putting Cell Phones In Pockets May Damage Your Health

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్స్ ... నిజానికి నిత్యావసర వస్తువుగా మారిపోయాయి. ఇక మన జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అరచేతిలో ప్రపంచాన్ని చూపే హైస్పీడ్ ఇంటర్నెట్, సోషల్ నెట్‌వర్కింగ్, మ్యాప్స్, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్… ఇలా ఎన్నో రకాలుగా స్మార్ట్‌ఫోన్స్‌ను ఉపయోగిస్తున్నాం. అత్యంత చవక ధరలకే ఇవి మనకు ఇప్పుడు లభిస్తున్నాయి. అయితే వీటిని శరీరానికి అత్యంత దగ్గరగా పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందట. సెల్ టవర్ తరంగాలే కాదు, స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఉత్పన్నమయ్యే పలు తరంగాలు కూడా మనకు హాని కలిగిస్తాయట. మగవారైతే వీటిని తమ ప్యాంట్ జేబులలో, కొంత మంది మహిళలు దీన్ని తమ వక్షాలకు తాకేలా పెట్టుకుని వెళ్తుంటారు. ఇలా ఆయా ప్రదేశాల్లో స్మార్ట్‌ఫోన్లను పెట్టడం ప్రమాదకరమట.

ఇవి కూడా చదవండి:వాట్సాప్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్

స్మార్ట్ ఫోన్లను మహిళలు తమ వక్షాలకు తాకేలా పెట్టుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీనికి తోడు ఇతర క్యాన్సర్లు కూడా వస్తాయట. ఇక మగవారు తమ ప్యాంట్ జేబుల్లో ఫోన్లను పెట్టుకుంటే దాని నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా వీర్యం సరిగ్గా తయారు కాదట. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం తక్కువగా ఉంటుందట. కొంత మంది తమ ప్యాంట్ వెనుక జేబులో ఫోన్లను పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల వెన్నెముక, పిరుదుల సంబంధ సమస్యలు, నరాల బలహీనత వచ్చేందుకు అవకాశం ఉంటుందట. ప్రధానంగా సయాటిక్ అనే ఓ నరం ఇబ్బందులకు గురవుతుందట.

జేబుల్లో ఫోన్‌ను పెట్టుకుంటే దాని నుంచి విడుదలయ్యే హీట్ వల్ల ఒక్కోసారి ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుందట. దీని వల్ల మనకు సెకండ్ డిగ్రీ కాలిన గాయాలు అయ్యేందుకు అవకాశం ఉంటుందట.

అంతేకాదు ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా మన శరీర మెటబాలిజం ప్రక్రియ నెమ్మదిస్తుందట. ఇది మన మానసిక ఆరోగ్యంపై, మెదడుపై ప్రభావం చూపుతుందట.

ఫోన్ల వల్ల మానసిక ఆరోగ్యం క్షీణించడం మాత్రమే కాదు. ఈ క్రమంలో పలువురు ఫోన్ యూజర్లు డిప్రెషన్‌కు కూడా లోనవుతారట. నిద్రలేమి, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయట. సో స్మార్ట్ ఫోన్లతో జాగ్రత్త సుమా.

ఇవి కూడా చదవండి:ప్రియురాలికి రీఛార్జి చేయించాడని భార్య ఆత్మహత్య

ఇవి కూడా చదవండి:అమ్మాయి ఫోన్ దొరికిందని ఏం చేసాడో తెలుసా(వీడియో)

English summary

In these days every one was using mobile phones and we all were having the habbit of putting our mobile phones in our Shirt Pockets and Back Pockets . But due to this habbit that may damage your health .