అక్కడ వినాయకుడికి నైవేద్యంగా పెట్టేవి ఏంటో తెలిస్తే షాకవుతారు!

Putting Chicken and alcohol for lord Vinayaka

11:47 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Putting Chicken and alcohol for lord Vinayaka

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినాయక పూజలు చివరి దశకు చేరాయి. మరోపక్క నిమజ్జనాలు మొదలై ఘనంగా జరుగుతున్నాయి. ఇక పలువురు భక్తులు తమ ఆరాధనలు, పూజలు, నైవేద్యాలతో రకరకాలుగా స్వామిని కొలుస్తున్నారు. అయితే ఒకచోట మాత్రం గణేశుడికి నైవేద్యంగా ఊహించనిది పెడుతున్నారు. మామూలుగా అయితే ఉండ్రాళ్లు, పప్పన్నం, పాయాసం, కొబ్బరి, పళ్లు, పలహారాల వంటివి పెడుతుంటారు. కానీ అక్కడ మద్యం, మాంసంలను నైవేద్యంగా పెట్టడం ఆచారమట. ఇంతకీ ఎక్కడంటే, కర్నాటకలోని కొప్పల్ జిల్లా, భాగ్యనగర్ గ్రామంలో ఈ విధంగా జరుగుతోంది.

అలా చేస్తే స్వామి వారు సంతోషిస్తారని అక్కడివారి ఆచారమట. తరతరాలుగా ప్రతి ఏటా భాగ్యనగర్ గ్రామంలో వంద కుటుంబాలు కలిసి ఇలా మద్యం, మాంసాలను నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారంగా నడుస్తోంది. నెట్ లో ఈ వార్తలు చూసి బాప్ రే అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఈ సరస్సులో నీరు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి.. ఎందుకో తెలుసా?

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ కి మీ గురించి తెలిసిన రహస్యాలు ఇవే!

ఇది కూడా చదవండి: వశిష్టి దేవిగా శ్రేయ అదిరింది

English summary

Putting Chicken and alcohol for lord Vinayaka