మహంకాళి ఆలయంలో సింధు సందడి(ఫోటోలు)

PV Sindhu at Mahankali temple

01:13 PM ON 27th August, 2016 By Mirchi Vilas

PV Sindhu at Mahankali temple

రియో ఒలింపిక్స్ లో రజతం సాధించిన పీవీ సింధు గురించి తెలంగాణాయా, ఏపియా అని రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు వాదులాడుకుంటే, సింధు ఇండియన్ అంటూ ఆమె కోచ్ గోపీచంద్ చెప్పేసాడు. ఇక మా తాతగారి ఊరు విజయవాడ అని కూడా ఈమె చెప్పేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన హల్ చల్ సాగిస్తోంది. శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుంది. కుటుంబసభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న సింధు.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఈ సందర్భంగా సింధు మీడియాతో మాట్లాడుతూ.. ఏటా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటానని, ఒలింపిక్స్ లో పతకం సాధిస్తే మరోసారి వస్తానని మొక్కుకున్నాని చెప్పింది. విజయం సాధించినందున మళ్లీ అమ్మవారిని దర్శించుకున్నానని అంది.

1/5 Pages

English summary

PV Sindhu at Mahankali temple. PV Sindhu visit Mahankali temple in Hyderabad.