తెలుగు మూవీ డైలాగ్ లకు డబ్ స్మాష్ చెప్పిన పివి సింధు(వీడియో)

PV Sindhu dub smash for telugu movie dialogues

05:25 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

PV Sindhu dub smash for telugu movie dialogues

రియో ఒలింపిక్స్ లో రజతం సాధించి ఓవర్ నైట్ వివిఐపి అయిపోయిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు. అయితే రియో నుంచి తిరిగి వచ్చిన సింధుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికింది. ఈరోజు విజయవాడలో కూడా పివి సింధుని నారా చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు. ఈమెకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు కాసుల వర్షం కురిపించి, గ్రూప్ 1 ఉద్యోగం ఆఫర్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అయితే రూ. 3 కోట్లు బహుమానంగా ప్రకటించి రాజధాని అమరావతిలో 1000 గజాల స్థలాన్ని కేటాయించింది.

ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ తెలుగు సినిమా డైలాగులకు డబ్ స్మాష్ చేసింది. ఆమె చేసిన డబ్ స్మాష్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఒకసారి ఆ వీడియో మీరు కూడా చూసేయండి.

English summary

PV Sindhu dub smash for telugu movie dialogues.