సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న బ్యాడ్మింటన్‌ స్టార్‌!!

P.V. Sindhu giving entry in movies

12:43 PM ON 30th January, 2016 By Mirchi Vilas

P.V. Sindhu giving entry in movies

క్రీడాకారులు సినిమాలలో కనిపించడం కొత్తేమి కాదు. 'అశ్విని నాచప్ప' కొన్ని సంవత్సరాల క్రితం వెండితెర పై కనిపిచింది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి 'జ్వాలా గుత్తా' నితిన్‌ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో కనిపించింది. ఇప్పుడు మరో తెలుగు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి సింధు నటిగా మారాలని ఆశపడుతుంది. మలేషియా మాస్టర్స్‌ లో విజయం సాధించిన తర్వాత జరిగిన ఒక ఇంటర్‌వ్యూ లో తను సినిమాలో నటించడానికి ఆశపడుతుందని చెప్పింది. తన నిజజీవితం ఆధారంగా తీసే సినిమాలో నటించాలని తన కోరికట. కానీ ఇదంతా ఆ సినిమాను ఎవరు తీస్తారు, సినిమా చిత్రీకరణకు ఎంత సమయం పడుతుంది అనే విషయం పై ఆధారపడి ఉందని చెప్పింది.

అంతా సవ్యంగా ఉంటే ఈ 20 ఏళ్ళ క్రీడాకారిణి నిజజీవితం వెండితెర పై కనపడనుంది. ఇటీవల భారత ప్రభుత్వం సింధూ కి 'పద్మశ్రీ' పురస్కారం ఇచ్చింది.

English summary

Badminton star P.V. Sindhu giving entry in movies. She want to act in her life history.