డ్రెస్ కంపెనీ వివాదంలో సింధు

PV Sindhu in controversy

03:49 PM ON 3rd September, 2016 By Mirchi Vilas

PV Sindhu in controversy

రియో ఒలింపిక్స్ స్టార్స్ ను బట్టల వివాదం వెంటాడుతోంది. బ్యాడ్మింటన్ లో రజత పతకం సాధించిన పీవీ సింధు ఇప్పటికే పలువురు ప్రశంసలు అందుకుని, భారీ నజరానాలు సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడో వివాదంలో చిక్కుకుందని అంటున్నారు. ఈమెతో పాటు జన హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాండ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీధర్ తమ బట్టలు ధరించలేదని, ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. రియో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులందరూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలన్న షరతుతో భారత ఒలింపిక్స్ సంఘానికి రూ.3 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని ఆ కంపెనీ చెప్పిందట.

సింధు, దీప, దత్, శ్రీకాంత్ కొన్ని మ్యాచుల్లో తమ బ్రాండ్ దుస్తులను కాకుండా ఇతర బ్రాండ్ల దుస్తులు ధరించారని సదరు కంపెనీ అంటోంది. ఈ మేరకు భారత ఒలింపిక్స్ సంఘానికి ఆ కంపెనీ ఓ లేఖ రాసినట్లు క్రీడా వర్గాల ఇన్ సైడ్ టాక్. ఈ క్రీడాకారులకు వేరే కంపెనీల దుస్తులను ఇచ్చిన ఫెడరేషన్లకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లేఖ రాసినట్లు చెబుతున్నారు. ఇది పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. దీనిపై ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: తల్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

ఇది కూడా చదవండి: భార్యపై ట్వీట్ తో చమత్కారం విసిరిన సెహ్వాగ్

ఇది కూడా చదవండి: మీ దగ్గర ఈ కెమికల్స్ ఉంటే మీ పాత ఫోన్ నుంచి బంగారం తియ్యొచ్చు!

English summary

PV Sindhu in controversy