శ్రీవారి సన్నిధిలో సింధు తులాభారం(వీడియో)

PV Sindhu visits Tirumala

11:58 AM ON 6th September, 2016 By Mirchi Vilas

PV Sindhu visits Tirumala

రియో ఒలింపిక్స్ లో భారత్ కు రజత పతకం అందించిన యువ క్రీడాకారిణి పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తల్లిదండ్రులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న సింధూకు టీటీడి అధికారులు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సింధు 68 కిలోల బెల్లంతో శ్రీవారికి తులాభారం మొక్కు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో సింధు మాట్లాడుతూ, చాలామంది అమ్మాయిలూ చాలా స్పోర్ట్స్ లో బాగా చేస్తున్నారు.

మున్ముందు ఇంకా వస్తారని ఆశిస్తున్నానని చెప్పింది. పీవీ సింధు తులాభారం వీడియో, ఫోటోలు కింద స్లైడ్ షోలో చూడవచ్చు..

1/7 Pages

English summary

PV Sindhu visits Tirumala. Olympics winner PV Sindhu visited Tirumala yesterday.