సింధూ సూపరో సూపర్‌

PV Sindhu Wins Malaysia Masters Grand Prix Gold tournament

12:59 PM ON 25th January, 2016 By Mirchi Vilas

PV Sindhu Wins Malaysia Masters Grand Prix Gold tournament

భారత స్టార్ షట్లర్ పివి సింధూ సత్తా చాటింది. 2016లో మొదటి అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నిలోనే విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మలేషియా మాస్టర్స్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో సునాసయంగా విజయం సాధించిన సింధూ టైటిల్‌ను గెలుచుకుంది. మలేషియా మాస్టర్స్‌ టైటిల్‌ను గెలుచుకోవడం సింధూకు ఇది రెండోసారి. 2013లోనూ సింధూ ఇక్కడ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్మోమోర్‌తో సింధూ తలపడింది. 32 నిమిషాల్లోనే ఫైనల్‌ మ్యాచ్‌ను ముగించడం సింధూ దూకుడుకు అద్దం పట్టింది. గిల్మోమోర్‌పై 21-15, 21-9 స్కోరుతో సింధూ విజయం సాధించింది. గిల్మోమోర్‌పై సింధూకు ఇది తొలి విజయం. సింధూ, గిల్మోమోర్‌ ముఖాముఖా తలపడ్డం ఇది రెండోసారి. ఇది వరకూ 2013లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సింధూపై గిల్మోమోర్‌ విజయం సాధించింది. ఆదివారం ఫైనల్‌లో సింధూ ప్రారంభం నుంచి ఆధిక్యంలో కొనసాగింది. తొలి సెట్‌లో కొన్ని సార్లు గిల్మోమోర్‌ నుంచి పోటీ ఎదురైనా, రెండో సెట్‌లో సింధూ ఆధిక్యం పూర్తిగా కొనసాగింది. ఈ విజయంతో సింధూకు 9 వేల అమెరికన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ లభించింది. కెరీర్‌లో రెండో సారి మలేషియా మాస్టర్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ గెలుచుకున్న పివి సింధూకు భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య శుభాకాంక్షలు తెలిపింది. రూ.5 లక్షల నగదు బహుమతి ప్రకటిచింది.

English summary

Indian Star Badminton Player PV Sindhu wins Malaysia Masters Grand Prix Gold tournament . In final match she won against scottish badminton player Kirsty Gilmour