రజతం గెలిచినా .. సింధు బంగారమే ..

PV Sindhu won an Olympic silver medal

12:27 PM ON 20th August, 2016 By Mirchi Vilas

PV Sindhu won an Olympic silver medal

రియో ఒలింపిక్స్ లో మహిళల బాడ్మింటన్ ఫైనల్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధు బాడ్మింటన్ చరిత్రలో ఒలింపిక్ రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో సింధు 21-19, 12-21, 15-21 తేడాతో ఓటమి పాలై, స్వర్ణ పతకం చేజార్చుకున్నా, గెలుపుకోసం ఈమె ఆడిన తీరు 125 కోట్ల మంది భారతీయుల హృదయాలను గెల్చి, బంగారు తల్లి గా జేజేలు అందుకుంది. అనుభవజ్ఞురాలైన ప్రత్యర్థి మారినా ముందు సింధు దూకుడు నిలవలేకపోయింది. దీంతో ఈ భారత సంచలన సింధు రజతంతో సరిపెట్టుకుంది. ఆట జరుగుతున్నంత సేపూ అందరూ టీవీలకు అతుక్కుపోయి ఉత్కంఠ గా వీక్షించారు. హోరాహోరీగా మ్యాచ్ నడించింది. ఫైనల్లో ఓడినా 125కోట్ల మంది భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకుందంటూ, సోషల్ మీడియాలో పెద్దఎత్తున కామెంట్స్ పెట్టారు. సింధుని ఆకాశానికి ఎత్తేసారు.

1/9 Pages

మొత్తానికి చుక్కలు చూపింది ...

వల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్ కు రియో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ పోరులో సింధు చుక్కలు చూపింది. తనను ఓడించడం అంత సులువు కాదని తేల్చింది. తొలిసెట్ ఓడిపోతుందని అంతా అనుకునేలోపే కరోలినాను మెరుపువేగంతో ఓడించి సత్తా చాటింది. అప్పుడు కానీ సింధు తడాఖా ఏంటో వల్డ్ నెంబర్ వన్ కు తెలిసిరాలేదు. 21-19తో సింధు తొలి సెట్ గెలుచుకుని కరోలినాకు షాకిచ్చింది. ఆ తరవాత రెండో సెట్ లో కరోలినా పూర్తి ఆధిపత్యం చూపేందుకు యత్నించింది. అయితే మళ్ళీ మరోసారి సింధూ విజృంభించింది. వీరోచితంగా పోరాడింది. దీంతో కరోలినా రెండో సెట్ ను 21-12తో గెలుచుకుంది. ఇక కీలకమైన మూడో సెట్ లో సింధు, కరోలినా ఇద్దరూ జాగ్రత్తగా ఆడారు. అయితే కరోలినా తెలివిగా ఆడుతూ పాయింట్లు స్కోర్ చేసింది. అయినా సింధూ వెనకడుగు వేయక 15 పాయింట్లు సాధించింది. అయితే ఈలోగానే కరోలినా విన్నింగ్ పాయింట్ కు చేరుకుంది. మూడోసెట్ ను కరోలినా 21-15తో గెలుచుకుంది. అయితే సింధును గెలవడం అంత సులభం కాదని మాత్రం కరోలినా గ్రహించింది. సింధూపై గెలుపుకోసం వీరోచితంగా పోరాడాల్సి వచ్చింది.

English summary

PV Sindhu creates history, she is the first Indian woman to win an Olympic silver medal.