ఆల్బంలో సైతం బూతు చూపించిన జరీన్ ఖాన్(వీడియో)

Pyaar Manga Hai album video song

04:11 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Pyaar Manga Hai album video song

'వీర్' చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించిన జరీన్ ఖాన్ కు ఆ చిత్రం ప్లాప్ కావడంతో సరైన గుర్తింపు రాలేదు. ఆ తరువాత అర డజన్ సినిమాల్లో నటించింది అయినా సరైన గుర్తింపు రాలేదు. అయితే ఆ తరువాత 2015లో వచ్చిన 'హేట్ స్టోరీ 3' లో హద్దు అదుపు లేకుండా అందాలు ఆరబోసింది. దీంతో ఈ అమ్మడు ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ సినిమా కధ రొటీన్ ఏ అయినా ఈ అమ్మడు అందాలు చూడటానికే జనాలు ఎగబడ్డారు. దీంతో ఆ చిత్రానికి మంచి కలెక్షన్స్ ఏ వచ్చాయి. దాని తరువాత జరీన్ ఖాన్ కు అవకాశాలు కూడా పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా 'ప్యార్ మాంగా హై' అనే ఆరున్నర నిమిషాల వీడియో ఆల్బమ్ లో నటించింది.

ఈ వీడియోకి కేవలం 2 రోజుల్లో 11 లక్షలకుపైగానే వ్యూస్ వచ్చాయి. ఇందులో జరీన్ఖాన్- అలీఫజల్ లో మధ్య రొమాన్స్, బోల్డ్ సీన్స్ కు కొదవలేదు. ఇలాంటి వీడియోల వైపు యువత ఎంతగా ఎట్రాక్ట్ అవుతున్నారో ఇదే ఒక నిదర్శనం. వీడియో సిరీస్ బాగుందని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తంచేస్తుండగా, మరికొందరు తప్పుబడుతున్నారు. నైతిక విలువలకు నిర్మాణ కంపెనీలు సైతం తిలోదకాలు ఇచ్చేశాయని దుయ్యబడుతున్నారు. దీనికి బదులు బూతు సినిమాలు తీసుకోవచ్చుకదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకప్పటి మాదిరిగా యూట్యూబ్ ఇప్పుడులేదని, ఇంటర్నెట్ దగ్గరకి వెళ్లాలంటే భయం పుడుతోందన్నది మరికొందరి వాదన. మొత్తం మీద జరీన్ మాత్రం రెచ్చిపోతుంది. ఒకసారి ఆ ఆల్బమ్ పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Pyaar Manga Hai album video song