నా కొడుకును క్షమించొద్దు... కనిపిస్తే కాల్చేయండి!

Qandeel Baloch father says that please kill my son

03:02 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

Qandeel Baloch father says that please kill my son

పాకిస్తాన్ హాట్ మోడల్ కందీల్ బలోచ్ ని ఆమె తమ్ముడు ఘోరంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆమె తండ్రి అన్వర్ అజీమ్ తాజాగా ఒక షాకింగ్ కామెంట్ చేసాడు. అదేంటంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకును క్షమించొద్దు... కనిపిస్తే కాల్చేయండి అంటూ మోడల్ కందీల్ బలోచ్ ను హత్య చేసిన నింధితుడైన ఆమె తమ్ముడు వసీమ్ విషయంలో ఆయన తండ్రి అన్వర్ అజీమ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. బలోచ్ ను హతమార్చిన రోజు తాను భార్యతోపాటు మేడపై నిద్రపోతున్నానని, పడుకోవడానికి ముందు తమ కొడుకైన వసీం పాలలో మత్తుమందు కలిపి తమకి ఇచ్చాడని అజీమ్ చెప్పారు.

తాము మత్తులో ఉండగా తమ కూతురు బలోచ్ ను కొడుకే గొంతు నులిమి చంపాడన్నారు. మరునాడు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసేందుకు లేవమని కందీల్ ను లేపగా విగతజీవిగా పడి ఉందని తండ్రి ఆవేదనగా చెప్పారు. ఆమె గొంతు వద్ద నల్లటి చారలు కనిపించాయన్నారు. తమ కూతురు బలోచ్ మంచి అమ్మాయి అని, కాని తన కొడుకైన వసీం అన్యాయంగా ఆమెను పొట్టన పెట్టుకున్నాడని తండ్రి అజీమ్ పేర్కొన్నారు. తన కొడుకును కాల్చి చంపేయాలని ఆయన కోరారు.

English summary

Qandeel Baloch father says that please kill my son