మతాధికారితో మోడలమ్మ యవ్వారం!

Qandeel Baloch is the reason behind Muslim cleric suspend

04:01 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Qandeel Baloch is the reason behind Muslim cleric suspend

పాకిస్థాన్ లో తాజాగా జారిగిన ఓ సంఘటన విస్తృతంగా హల్ చల్ చేస్తోంది. నిజంగా ఈ యవ్వారం ఇప్పుడు పెద్ద సంచనలంగా మారింది. అసలు విషయం ఏమంటే, ఒక మతాధికారితో ఒక మోడల్ దిగిన సెల్ఫీ తీవ్ర దుమారం రేపింది. సదరు మతాధికారి పదవి ఊడిపోవటం కూడా జరిగిపోయింది. హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలో పాక్ మోడల్ కాందీల్ బాలోచ్.. పాక్ మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావిని ఇఫ్తార్ విందుకు ఫైవ్ స్టార్ హోటల్ కు పిలిచిందట. పిలిచిందే తడవుగా ఆయన వెళ్లారు. అయితే అక్కడ మత విషయాలు నేర్చుకుంటానని చెప్పి.. ఆహ్వానించటంతో తాను వెళ్లినట్లుగా ఖావి చేసే వాదన.

అసలు అక్కడ ఏమి జరిగిందంటే, ఆయన ఫోన్ మాట్లాడుతున్న వేళ.. ఆయన ధరించిన టోపీని మోడల్ బాలోచ్ పెట్టుకొని ఆయనతో కలిసి సెల్ఫీలు దిగేసింది. పోనీ అంతటితో ఊరుకున్నా పోయేది. వాటిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో ఇదో వివాదమై కూర్చుంది. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ఒక మతాధికారి ఇలాంటి పనులు చేయటం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో.. ఆయన్ను మతాధికారి పదవి నుంచి హోస్టింగ్ ఇచ్చేసారు. అయితే ఈ గొడవ అక్కడితో ఆగలేదు. ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తే వెళ్లానని.. అంతకు మించి మరేదీ తనకు సంబంధం లేదని ఖావి చెబుతుంటే..

ఆయన తనకు ప్రపోజ్ చేశారంటూ బాలోజ్ తాజాగా పేల్చిన బాంబుతో ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లైంది. మొత్తానికి ఈ మోడలమ్మతో మతాధికారి యవ్వారం ఏమిటన్నది ఇప్పుడు హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. అసలు ఏమైందో ఆ మోడల్ చెప్పాలి. అప్పుడే ముగింపు దశకు చేరుతుంది.

English summary

Qandeel Baloch is the reason behind Muslim cleric suspend