కోహ్లీకి ప్రపోజ్ చేసిన పాకిస్తాన్ మోడల్ దారుణ హత్య!

Qandeel Baloch was murdered by her brother

05:53 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Qandeel Baloch was murdered by her brother

పాకిస్తాన్ పూనమ్ పాండేగా పేరు గాంచిన ఖండీల్ బలోచ్ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమిస్తున్నాని చెప్పి అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. టీ-20 వరల్డ్ కప్ లో విరాట్ వీరవిహారం చూసి కోహ్లీ పై మనసు పారేసుకుంది. కోహ్లీని తాను ఎంతగానో ప్రేమిస్తున్నానని, అనుష్క శర్మను వదిలేసి తనను లవ్ చేయమని సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేసింది. అఫ్రీదీని తిడుతూ, ఏడుస్తూ ఆమె పెట్టిన వీడియో చాలా ఫేమస్ అయ్యింది. అయితే.. ఇప్పుడు ఖండీల్ బలోచ్ దారుణ హత్యకు గురి అయింది. బలోచ్ తన సొంత అన్నయ్య చేతిలో దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

శనివారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సోషల్ మీడియా వేదికగా అశ్లీల ఫోటోలు పోస్ట్ చేసి తమ కుటుంబ పరువు తీస్తుందనే ఉద్ధేశంతో ఆమెను ఆమె సోదరుడు బెధిరించినట్లు తెలుస్తోంది. కుటుంబం పరువు కోసం బలోచ్ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. ఖండీల్ బలోచ్ కు గతంలోనే పలుసార్లు ఛాందసవాదుల నుంచి చంపేస్తామని బెధిరింపులు కూడా వచ్చాయి. దీనితో భద్రత కోసం ఆమె పాక్ హోంశాఖకు విజ్ఞప్తి చేసినా.. హోంశాఖ స్పందించకపోవడంతో.. ఈద్ అనంతరం ఆమె విదేశాల్లో స్థిరపడాలని నిశ్చయించుకున్నారని ఇంతలోనే ఈ దారుణం జరిగిందని సన్నిహిత వర్గాల సమాచారం.

English summary

Qandeel Baloch was murdered by her brother