ఫుల్ మెటల్ బాడీతో క్వికూ క్యూ టెర్రా 808

Qiku launches Q Terra 808 in India

04:45 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Qiku launches Q Terra 808 in India

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్త క్వికూ భారత్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ క్యూ టెర్రా 808 పేరిట స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కికూ క్యూ టెర్రా 808 స్మార్ట్‌ఫోన్‌ను అల్యూమినియం, మెగ్నిషియం మిశ్రమాలతో తయారు చేసిన పూర్తి స్థాయి మెటల్‌తో రూపొందించారు. ఫోన్ ఎడ్జ్‌లు, బ్యాక్ ప్యానెల్, బటన్లను కూడా మెటల్‌తోనే నిర్మించారు. 6 ఇంచ్ డిస్‌ప్లేను ఇందులో అందిస్తున్నారు. 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ డివైస్‌లో ఉండగా దాదాపు 10 జీబీ స్పేస్‌ను యూజర్లు వాడుకోవచ్చు. 128 జీబీ వరకు మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌ను పొందవచ్చు. యూఎస్‌బీ ఓటీజీ సపోర్ట్‌ను ఇందులో అందిస్తున్నారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 810 హెగ్జాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చార్జింగ్ పెట్టిన మొదటి 30 నిమిషాలలోపే దాదాపు 50 శాతం వరకు బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ సిమ్ వేసుకునే సౌలభ్యం ఉండగా రెండో సిమ్ స్లాట్‌లో సిమ్‌కార్డ్ లేదా ఎస్‌డీ కార్డును వేసి ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోపాటు ఇందులో 360 సెక్యూరిటీ, యాంటీ థెఫ్ట్, ప్రైవసీ స్పేస్, కికూ క్లౌడ్, ఫ్రీజర్, 360 ట్రాన్స్‌ఫర్ వంటి యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. దీని ధర రూ.19,999. ఈ ఫోన్ ను ఎన్డీటీవీ గాడ్జెట్ వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

English summary

Chinese smartphone brand Qiku on Friday launched the Q Terra 808 smartphone in India.The price of this smart phone would be Rs.19 999.