తండ్రీ కొడుకుల మధ్య చిచ్చు - యుపిలో రసవత్తర రాజకీయం

Quarrel Between Father and son became fun in the U.P Politics

11:10 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

Quarrel Between Father and son became fun in the U.P Politics

అధికారం కై పెనుగులాటలో అన్నాదమ్ముల పోటీ .. అంటూ ఓ సినీకవి రాసారు కదా. అయితే ప్రస్తుతం ములాయం , అఖిలేష్ ల వ్యవహారం చూస్తుంటే,వారెవ్వా అధికారం మజా వేరులే అనిపించకమానదు. తండ్రి ములాయం సింగ్ యాదవ్ నుంచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పార్టీ పగ్గాలు గుంజుకున్నారు. తండ్రిని పార్టీ మార్గదర్శిగా మార్చేసి, తాను జాతీయ అధ్యక్షుడయ్యారు. అటు పార్టీ యూపీ అధ్యక్షుడు, తన బాబాయి అయిన శివ్ పాల్ యాదవ్ ను పార్టీ నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఉత్తమ్ నరేశ్ ను యూపీ సమాజ్ వాదీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ వెంటనే నరేశ్ వర్గీయులు సమాజ్ వాదీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దీంతో ములాయం కన్నెర్ర జేస్తూ, ఉత్తమ్ నరేశ్ ను పార్టీ నుంచి తొలగించారు. రాంగోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు మళ్ళీ తొలగించారు. పార్టీ తన ఆధీనంలోనే ఉందని ములాయం ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలవేళ అధికార సమాజ్ వాదీ పార్టీలోని ఈ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించి పోయిన ట్విస్ట్ లు ఇస్తున్నాయి. ఈ తండ్రికొడుకుల డ్రామా మరో మలుపు తిరిగింది. మొత్తం ఈ కధ వివరాల్లోకి వెళ్తే, మొన్న యూపీ సీఎం - కొడుకు అఖిలేష్ ను పార్టీ నుంచి ములాయం బహిష్కరించడం.. నిన్న కాస్త మెత్తబడి మళ్లీ దానిని ఎత్తివేయడంతో ముసలం సమసిపోయిందని అంతా భావించారు. కానీ ఆదివారం ఈ డ్రామాకు కొత్త ట్విస్ట్ వచ్చింది. అధ్యక్ష పీఠంపై అఖిలేష్ కూర్చున్నారు. అంతేకాదు పార్టీ సీనియర్ నేత - తన తండ్రికి ఆప్తుడు అయిన అమర్ సింగ్ పై వేటు వేసేలా చక్రం తిప్పారు.

అనూహ్య పరిణామాల్లో భాగంగా తన ఎమ్మెల్యేలు - మద్దతుదారులతో లక్నోలో అఖిలేష్ బలప్రదర్శనకు దిగారు. తండ్రిపై యుద్ధం ప్రకటించారు. ఈ సందర్భంగా ములాయం స్థానంలో అఖిలేష్ యాదవ్ను సమాజ్ వాదీ చీఫ్గా ప్రకటించారు ఆయన బాబాయ్ రాంగోపాల్ యాదవ్. ఈ సమావేశం అక్రమమని దీనికి హాజరైన వారందరిపై చర్యలు ఉంటాయని ములాయం హెచ్చరించిన కొన్ని నిమిషాల్లోనే అఖిలేష్ ను పార్టీ రథసారథిగా ప్రకటించారు. అంతేకాదు అఖిలేష్ ను ఇరుకున పెడుతున్న ప్రత్యర్థి వర్గంలోని శివపాల్ యాదవ్ - అమర్ సింగ్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ జాతీయ సదస్సులో అఖిలేష్ ను పార్టీ ఛీఫ్ గా ప్రకటించిన రాంగోపాల్... పార్టీ మూలవిరాఠ్ అయిన ములాయంను మార్గదర్శకం వ వ్యవహరించాలని కోరడం కొసమెరుపు. జై అఖిలేష్ నినాదాల మధ్య రాంగోపాల్ ఈ ప్రకటన చేశారు. పార్లమెంటరీ బోర్డును కొత్తగా నియమిస్తామని ఈ విషయం ఎన్నికల సంఘానికి వెల్లడిస్తామని రాంగోపాల్ తెలిపారు.

కాగా అనేక ట్విస్ట్ ల మధ్య పార్టీ రథసారథిగా ఎన్నికైన తర్వాత అఖిలేష్ మాట్లాడుతూ.. తమకు నేతాజీ (ములాయం) స్థానం అత్యుత్తమమైనదని యూపీలో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తే ములాయం కంటే ఎక్కువ సంతోషించేవాళ్లు ఎవరూ ఉండరన్నారు. తన తండ్రి పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతుంటే దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అఖిలేష్ చెప్పారు. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకోవాలని ములాయం అడిగి ఉంటే తాను దిగిపోయేవాడినని తెలిపారు. మా తండ్రీకొడుకులను ఎవరూ వేరు చేయలేరని అఖిలేష్ స్పష్టంచేశారు. యూపీ ప్రజలకు మేలు చేసే సర్కారును మరోమారు అందిస్తామని అఖిలేష్ పేర్కొన్నారు. ఇంకా ఎన్ని మార్పులు సంభవిస్తాయో చూడాలి.

ఇది కూడా చూడండి: పరగడుపున నీళ్ళు తాగితే ఏం జరుగుతుందో తెలుసా!

ఇది కూడా చూడండి: ఆ నాలుగు చోట్ల సెల్‌ఫోన్‌ పెట్టుకొంటే ఇక అంతే

ఇది కూడా చూడండి: పూజలో రాగిపాత్రలను వాడడం వెనుక అసలు రహస్యం ఇదే

English summary

Fun created in the U.P politics. Akelish Yadav CM of U.P made many changes in his party.