గ్రేటర్ ఎన్నికలు జరిగేనా ?

Question Mark On GHMC Elections

02:55 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Question Mark On GHMC Elections

కొత్త సంవత్సరంలో అందునా జనవరి లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నా , తాజాగా సుప్రీం కోర్టు సూచనతో ఎన్నికలు అనుమానమేనని తెలుస్తోంది. ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతుండగా , ఓట్ల తొలగింపు అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ నేపధ్యంలో హైకోర్టు ను ఆశ్రయించాలని సుప్రీం సూచించింది.

దాదాపు 7 లక్షల ఓట్లను తొలగించారని , ఓట్ల సరిదిద్దే కార్యక్రమం పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ పిటీషన్ దాఖలైంది. దీంతో సుప్రీం స్పందిస్తూ , హైకోర్టు ను ఆశ్రయించాలని సోమవారం సూచించింది. దీంతో హైకోర్టు కి వెళితే , ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. టెన్త్ , ఇంటర్ , డిగ్రీ పరీక్షలు వరుసగా జరుగుతాయి కనుక కనీసం మూడు నాలుగు నెలల వరకు ఎన్నికలు ఉండవని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ హైకోర్టు లో వీగిపోతే , ఎన్నికలు అనుకున్న సమయంలోనే ఉంటాయని కూడా మరో వాదన వినిపిస్తోంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల సందదిపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

English summary