రాశిఖన్నా బర్త్‌డే పార్టీలో తారల సందడి...

Raashi khanna birthday celebrations

08:33 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Raashi khanna birthday celebrations

మనం చిత్రంలో గెస్ట్‌ అప్పీరియన్స్‌ చేసి తరువాత 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన సుందరి రాశీఖన్నా. అనతికాలంలోనే మంచి గుర్తింపు పొంది స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. రాశీఖన్నా తాజాగా నటించిన చిత్రం 'బెంగాల్‌ టైగర్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్‌హీరో రవితేజతో నటించే అవకాశం కొట్టేసిన ఈ చిన్నదాని పుట్టినరోజు ఈరోజు (నవంబర్‌30). ఈ సందర్భంగా రాశీ ఇచ్చిన పార్టీకి ఆమె అత్యంత సన్నిహితులు కొంతమంది ఈ పార్టీకి విచ్చేశారు. హీరోల్లో రవితేజ, రామ్‌, సందీప్‌కిషన్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌ మరియు అల్లుశిరీష్‌ ఈ విందుకు విచ్చేయగా హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ విచ్చేసింది.

ఈ పార్టీలో హీరోలు కన్నా రకులే ఎక్కువ గోల చేసిందట. అంతేకాదు రకుల్‌ తన ట్విట్టర్‌లో 'నాకు బాగా ఇష్టమైన రాశీఖన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తనకి సూర్‌ హిట్‌ ఇయ్యర్‌ కావాలని కోరుకుంటున్నా అని శుభాకాంక్షలు తెలిపింది. పార్టీలో సందడి చేసిన ఫొటోలు, సెల్ఫీలు ట్విట్టర్‌లో పోస్ట్‌ కూడా చేశారు. ఈ పుట్టినరోజుతో ఈ ముద్దుగుమ్మ 23 ఏళ్లు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. మరీ మనం కూడా ఈ సుందరికి శుభాకాంక్షలు తెలుపుదామా!!

English summary

Raashi khanna birthday party celebrated by heroes raviteja,varunteja, sundeep kishan, rakul preeth singh.