హీరోయిన్‌కి తల్లిగా 'రాశి'!

Raasi acting after 12 years in Kalyana Vaibhogame movie

03:34 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Raasi acting after 12 years in Kalyana Vaibhogame movie

అందాల విందుతోనూ, నటనతోనూ దాదాపు దశాబ్ధం పాటు హీరోయిన్‌గా మెరిసింది రాశి. జగపతిబాబు, శ్రీకాంత్‌, రాజేంద్రప్రసాద్, పవన్‌కళ్యాణ్‌, నవీన్‌వడ్డే వంటి స్టార్‌ హీరోలతో రాశి నటించింది. హీరోయిన్‌గా నటిస్తున్న సమయంల్లోనే హఠాత్తుగా నివాస్‌ అనే డైరెక్టర్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు వీడ్కోలు చెప్పేసింది. దాదాపు 12 సంవత్సరాలు పాటు రాశి సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు 12 సంవత్సరాలు తరువాత రాశి మొహానికి రంగు వేసుకుంది. నాగశౌర్య, మాళవికనాయర్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'కళ్యాణ వైభోగమే'.

'అలామొదలైంది' ఫేమ్‌ నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ మాళివిక నాయర్ తల్లిగా రాశి నటిస్తుంది. దాదాపు చాలా కాలం తర్వాత మీరు సినిమాల్లో నటిస్తున్నారు కదా అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా అని రాశిని అడగగా, చాలా కాలం తరువాత సినిమాలో నటిస్తున్నా అయితే ఇంత గ్యాప్‌ వచ్చినా కెమెరా ముందుకు రావడానికి భయం, కొత్త ఏమీ అనిపించలేదు. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడానే వచ్చింది, అప్పుడు కేవలం అందం ప్రదర్శించే పాత్రల్లోనే కాదు నటనకి ఆష్కారం ఉన్న పాత్రల్లో కూడా నటించే దాన్ని.

కానీ ఇప్పడు అలా కాదు ఏదో నటించాంలే, ఎక్స్‌పోజింగ్‌ చేస్తే హీరోయిన్‌గా రాణించేయొచ్చులే అనుకుని హీరోయిన్లు నటిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది.

English summary

Raasi acting after 12 years in Kalyana Vaibhogame movie. She is acting as a heroine mother in this movie.