బాలయ్యను కామెంట్ చేసిన రాధిక ఆప్టే(వీడియో)

Radhika Apte commented on BalaKrishna

01:32 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Radhika Apte commented on BalaKrishna

తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ప్రయత్నించడం కొద్ది పేరు రాగానే బాలీవుడ్ కి వెళ్ళిపోయి తెలుగు చిత్రసీమను అవమాన పరచడం చాలా మంది హీరోయిన్లకు అలవాటైన పనే ఇది. ఈ లిస్టులో రాధిక ఆప్టే పేరు కూడా ఉంది. తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్, లయన్ సినిమాలు చేసిన ఈ భామ ఆ తరువాత హిందీ సినిమాల్లో బిజీ అయిపొయింది. అక్కడికి వెళ్ళిన తరువాత సౌత్ లో హీరోయిన్లను చాలా చిన్న చూపు చూస్తారు, నాకు అసలు గౌరవం లభించలేదు అని డైలాగ్స్ వేసింది. తను చేసిన మూడు సినిమాల్లో రెండు బాలయ్యవి కావడమే విశేషం. అది జరిగిపోయిన కధ. ఇక లేటెస్ట్ గా 'కబాలి' లో నటించిన ఈ భామ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

'కబాలి' షూటింగ్ లో నన్ను హీరోతో సమానంగా చూసారు. గతంలో చేసిన కొన్ని సౌత్ సినిమాలు చాలా బాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇక లైఫ్ లో సౌత్ సినిమాలు చెయ్యకూడదు అనుకున్నాను, కానీ రజనీ సర్ సినిమా కాబట్టి చేసాను. షూటింగ్ టైంలో నన్ను కూడా ఆయనతో సమానంగా ట్రీట్ చేసారు అంటూ మళ్లీ ఇన్ డైరెక్ట్ గా మళ్లీ బాలయ్య పై కౌంటర్ వేసింది. అవకాశాలు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుని చెయ్యడం ఆ తరువాత వేస్ట్ అంటూ మాట్లాడడం టాలీవుడ్ పై వీళ్ళ అభిప్రాయం ఏంటో మరి.

English summary

Radhika Apte commented on BalaKrishna. Hot sexy beauty Radhika Apte controversial comments on Balakrishna