'కబాలి'తో రాధికా ఆప్టే!

Radhika Apte joined in Kabali shooting from today

02:20 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Radhika Apte joined in Kabali shooting from today

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కబాలి'. రంజిత్‌ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే మలేషియాలో ఒక షెడ్యూల్‌ని పూర్తిచేసుకుని చెన్నై కి తిరిగి వచ్చింది. ఈ చిత్రంలో రజనీకాంత్‌ ఒక డాన్‌గా నటిస్తున్నారు, ఆ డాన్‌కి భార్యగా 'రాధికా ఆప్టే' నటిస్తుంది. ఇన్ని రోజులు నా పాత్ర షూటింగ్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను, ఈ రోజు ఆ ఘుడియ వచ్చింది ఈ రోజు నుండి గోవాలో 15 రోజులు పాటు కబాలి షూటింగ్‌ జరగనుంది ఆ షూటింగ్‌ లో నేను ఈ రోజు నుండి పాల్గొనబోతున్నాను అని రాధికా ఆప్టే తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.

రజనీ సార్‌ పక్కన నటించే అవకాశం రావడం ఒక వరంగా భావిస్తున్నాను, ఎన్నో రోజుల నుండి నా పాత్ర షూటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నాను, ఈ రోజు నాకు పిలుపు వచ్చింది అంటూ తన ఆనందాన్ని పంచుకుంది రాధికా.

English summary

Radhika Apte joined in Kabaali shooting from today in Goa. The shooting is held from today onwards upto 15 days.