ఇక పై చూపించనంటున్న 'రాధికా'!!

Radhika Apte rejected to do skin show

12:52 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Radhika Apte rejected to do skin show

'రక్తచరిత్ర' చిత్రంతో తెలుగులో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. ఆ తరువాత 'లెజెండ్‌' చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఆ వెంటనే రాధికా బాలకృష్ణ నటించిన 'లయన్‌' చిత్రంలో కూడా నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ మొదట్లో సాంప్రదాయ పాత్రలు చేసినా ఆ తరువాత రెచ్చిపోయి మరీ తన అందాలు ప్రదర్శించింది. అయితే తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న 'కబాలి' చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడంతో రాధికా ఆప్టే రేంజ్ అమాంతం మారిపోయింది. అవకాశాలు కూడా మెండుగా వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు రేంజ్‌ మారిపోవడంతో తన వద్దకు సినిమాలు చేయమని వస్తున్న డైరెక్టర్లకు, నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట.

ఇక పై ఎక్స్‌పోజింగ్‌ చేసే ప్రసక్తే లేదు. నటనకు ఆస్కారమున్న పాత్రల్లోనే నటిస్తా అంటూ కండీషన్లు పెడుతుందట. ఇన్ని రోజులు విచ్చిలవిడిగా అందాల ఆరబోసిన రాధికా అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో రాధికా అభిమానులకు ఇది నిరాశే అని చెప్పాలి.

English summary

Radhika Apte rejected to do skin show in her next films. She don't want to expose her body in her upcoming films.